నజ్రియా మనసులో ఆ ముగ్గురు హీరోలు

ఓ సినిమా చేస్తే రెండేళ్లు గ్యాప్ తీసుకుంటుంది నజ్రియా. ఇలా 2-3 ఏళ్లకు ఓ సినిమా చేసే ఈ బ్యూటీకి కోరికలు మాత్రం చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనే…

ఓ సినిమా చేస్తే రెండేళ్లు గ్యాప్ తీసుకుంటుంది నజ్రియా. ఇలా 2-3 ఏళ్లకు ఓ సినిమా చేసే ఈ బ్యూటీకి కోరికలు మాత్రం చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనే కోరికను బయటపెట్టింది ఈ అమ్మాయి.

“తెలుగులో నాకు చాలా పెద్ద లిస్ట్ ఉంది. నేను తెలుగు సినిమాలు రెగ్యులర్ గా చూస్తాను. మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కుదిరితే వాళ్లతో సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఇక తమిళ్ లో అజిత్ లాంటి స్టార్స్ సరసన నటించే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తా.”

ఇలా మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తో నటించాలనే కోరికను బయటపెట్టింది నజ్రియా. నిజానికి ఈమె అందుబాటులో ఉండాలే కానీ, అవకాశాలివ్వడానికి ఆ ముగ్గురు రెడీ. ఎందుకంటే, నజ్రియాకు అందం ఉంది, నటించే సత్తా ఉంది. కాబట్టి ఆమెకు అవకాశాలు రావడం పెద్ద సమస్య కాదు.

ఎటొచ్చి సినిమాల పట్ల ఆమె వైఖరి మారనంతవరకు స్టార్ హీరోల సరసన ఆమెకు ఛాన్సులు రావు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు తన ప్రతి సినిమాకు రెండేళ్లు గ్యాప్ తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇలా గ్యాప్ తీసుకునే హీరోయిన్లకు ఛాన్సులు ఇవ్వడానికి పెద్ద హీరోలు అంతగా ఆసక్తి చూపించరు. 

నజ్రియాకు ఇదే పెద్ద మైనస్. లేకపోతే, ఈపాటికే ఆమె తన మనసులో ఉన్న ఆ ముగ్గురు హీరోలను కవర్ చేసి ఉండేది.