కొన్నాళ్ల కిందట ఒక ఫంక్షన్ బయట.. కెమెరాలకు పోజులిస్తూ వివాదంలో చిక్కారు బోనీకపూర్. నటి ఊర్వశి రౌటెల్ల బ్యాక్ ను ఆయన పలుసార్లు టచ్ చేస్తూ వీడియోలకు దొరికారు. ఒకవైపు వాళ్లిద్దరూ ఏదో మాట్లాడుతూ ఉంటారు, మరోవైపు బోనీకపూర్ తన చేత్తో ఆమె బ్యాక్ ను టచ్ చేస్తూ ఉంది. ఇదంతా వీడియోలకు ఎక్కింది.
ఈ విషయంలో అటు ఊర్వశి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. తనతో బోనీ అనుచితంగా ఏమీ ప్రవర్తించలేదని అప్పట్లోనూ ఊర్వశి స్టేట్ మెంట్ ఇచ్చింది. అయితే అసలే ఇది ‘మీటూ’ కాలం. ఇలాంటి నేపథ్యంలో ఆమె వాదన కన్నా, బోనీకపూర్ ఆమెను టచ్ చేయడమే ఎక్కువ హైలెట్ అయ్యింది. ఆ వీడియోలు వైరల్ మారాయి. బాలీవుడ్ మీడియా, ఇంగ్లిష్ మీడియాలు బోనీ అనుచిత ప్రవర్తన అంటూ తీర్మానించి వార్తలను ఇచ్చాయి.
ఆ వివాదం అలా తెరమరుగు అయ్యింది. ఇప్పుడు అదే అంశం గురించి ఊర్వశి స్పందించింది. బోనీకపూర్ తనను అనుచితంగా తాకలేదని మొదటి నుంచి చెబుతున్న ఈమె.. ఇప్పుడు కూడా అదేమాటే చెప్పింది. అంతేకాదు.. మీడియాలో జరిగిన ప్రచారంతో బోనీ కపూర్ ఫీల్ అయ్యాడేమో అంటూ ఊర్వశి ఫీల్ అవుతోంది కూడా.
ఆయన తనను కాంక్ష పూర్వకంగా తాకలేదని ఊర్వశి అంటోంది. ఏదో యథాఫలంగా తాకాడు తప్ప.. ఆయన టచ్ లో దురుద్దేశం లేదని ఈమె అభిప్రాయపడుతూ ఉంది. ఈ విషయం గురించి ఊర్వశి రౌటెల్ల తండ్రి కూడా స్పందించారట. దీనిపై ఆయన బోనీకపూర్ తో మాట్లాడారట. ఊర్వశి తండ్రి మాత్రం ఈ ఇన్సిడెంట్ ఆక్వర్డ్ గా ఉందని ఫీలయ్యాడట!