థర్డ్ పార్టీ చేతికి ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్ సినిమా శాటిలైట్ రైట్స్ స్టార్ మా కు దక్కలేదు. జెమినీ, జీ తెలుగు కూడా దక్కించుకోలేదు. ఈ సినిమా రైట్స్ అన్నీ గంపగుత్తగా మరో సంస్థకు వెళ్లాయి. అదే 'పెన్' స్టుడియోస్. ఆర్ఆర్ఆర్…

ఆర్ఆర్ఆర్ సినిమా శాటిలైట్ రైట్స్ స్టార్ మా కు దక్కలేదు. జెమినీ, జీ తెలుగు కూడా దక్కించుకోలేదు. ఈ సినిమా రైట్స్ అన్నీ గంపగుత్తగా మరో సంస్థకు వెళ్లాయి. అదే 'పెన్' స్టుడియోస్. ఆర్ఆర్ఆర్ నాన్-థియేట్రికల్ రైట్స్ ను మరో సంస్థ భారీ మొత్తానికి దక్కించుకుందనే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ఇప్పటికే వెల్లడించింది. దాన్ని నిజం చేస్తూ.. జయంతీలాల్ గడాకు చెందిన పెన్ స్టుడియోస్, కళ్లు చెదిరే రేటుకు ఈ సినిమా రైట్స్ దక్కించుకుంది.

తాజాగా జరిగిన ఒప్పందం ప్రకారం, ఆర్ఆర్ఆర్ కు చెందిన నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ తో పాటు.. అన్ని భాషలకు చెందిన శాటిలైట్, డిజిటల్ రైట్స్ మొత్తాన్ని హోల్ సేల్ గా ఈ సంస్థ దక్కించుకుంది. దీంతో ఇప్పటివరకు రేసులో ఉన్న అమెజాన్ ప్రైమ్, జీ తెలుగు, స్టార్ మా సంస్థలు వెనక్కి తగ్గాయి.

నాన్ థియేట్రికల్ రైట్స్ కింద దాదాపు 250 కోట్ల రూపాయలు ఆశించాడు నిర్మాత దానయ్య. ఒకేసారి స్టార్ మా, జీ గ్రూప్ సంస్థలతో బేరసారాలకు దిగాడు. కానీ ఏ ఛానెల్ దానయ్య ఆశించిన స్థాయిలో కోట్ చేయలేదు. సరిగ్గా అదే టైమ్ లో రంగంలోకి దిగిన పెన్ స్టుడియోస్ సంస్థ నార్త్-ఇండియా థియేట్రికల్ రైట్స్ తో పాటు నాన్-థియేట్రికల్ రైట్స్ అన్నింటినీ దక్కించుకుంది.

ట్రేడ్ ప్రకారం ఈ విలువ 400 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని ఓ అంచనా. అటు సౌత్ థియేట్రికల్ రైట్స్ కింద ఆర్ఆర్ఆర్ సినిమా 350 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. అంటే ఆర్ఆర్ఆర్ బిజినెస్ ఆల్రెడీ 750 కోట్ల రూపాయలు టచ్ అయిందన్నమాట.

తాజా డీల్ తో ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు క్లోజ్ అయింది. ఇక పెన్ స్టుడియోస్ నుంచి ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను ఏ ఛానెల్ దక్కించుకుంటుందో చూడాలి.