మెగాస్టార్ సడెన్ రిటర్న్

ఈ నెల 28 సాయంత్రం వరకు ఊటీలో వుండాల్సిన మెగాస్టార్ సడెన్ గా 27 సాయంత్రం హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. ఊటీకి గాడ్ ఫాదర్ షూటింగ్ కోసం వెళ్లారు. కానీ 25 సాయంత్రం హైదరాబాద్…

ఈ నెల 28 సాయంత్రం వరకు ఊటీలో వుండాల్సిన మెగాస్టార్ సడెన్ గా 27 సాయంత్రం హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. ఊటీకి గాడ్ ఫాదర్ షూటింగ్ కోసం వెళ్లారు. కానీ 25 సాయంత్రం హైదరాబాద్ లో పవన్ ప్రసంగం చేసారు. 

రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ చేసిన ప్రసంగంతో ఊటీలో వున్న మెగాస్టార్ చాలా అసంతృప్తికి గురయ్యారని వార్తలు వినవచ్చాయి.

ఇలాంటి టైమ్ లో 26 ఒక్క రోజు ఏదో విధంగా షూట్ చేసాను అనిపించారు. ఇక మిగిలిన రెండు రోజుల షూట్ ను తరువాత హైదరాబాద్ లో చేసుకుందాం అని చెప్పేసి చక్కా వచ్చినట్లు తెలుస్తోంది. మనసు బాగా లేకనే చిరంజీవి వెనక్కు సడెన్ గా వచ్చేసినట్లు తెలుస్తోంది. 

జగన్ దగ్గర అన్ని విధాలా సెట్ చేసి, టికెట్ ల జీవో ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తుంది అనగా పవన్ తన స్పీచ్ తో అంతా చెడిపోయింది. ఇదే మెగాస్టార్ ను బాధపెట్టినట్లు బోగట్టా.

ఇదిలా వుంటే చిరంజీవి వర్క్ అయిపోయిందని, కొద్ది వర్క్ హైదరాబాద్ లో చేసుకునే వీలు వుందనే ఆయన వెళ్లిపోయారన , మిగిలిన యూనిట్ ఊటీలోనే వుండి షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.