నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సైన్స్ ఫిక్షన్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయింది. పాన్-ఇండియా లెవెల్లో తీయబోతున్న ఈ మూవీలో హీరోయిన్ గా దీపిక పదుకోన్ ను ఫిక్స్ చేశారు. కొద్దిసేపటి కిందట ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ప్రభాస్-నాగఅశ్విన్ సినిమా కోసం కచ్చితంగా బాలీవుడ్ హీరోయిన్ నే తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగా కత్రినాకైఫ్, అలియాభట్ పేర్లు వినిపించాయి. అయితే అలియాభట్ ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ లో నటిస్తోంది కాబట్టి కత్రినాకైఫ్ ను తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. ఫైనల్ గా ఆ అవకాశం దీపిక పదుకోన్ ను వరించింది.
నిజానికి ఈ సినిమాలో దీపిక పదుకోన్ ఫిక్స్ అయిందనే విషయం నిన్న సాయంత్రం నుంచే సోషల్ మీడియాలో వచ్చేసింది. కాకపోతే ఈరోజు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. తెలుగులో దీపిక పదుకోన్ కు ఇదే ఫస్ట్ మూవీ.
వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని నాగ్ అశ్విన్ ఇటీవల ప్రకటించాడు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.