కరోనా ఎఫెక్ట్ వచ్చే ఏడాది కూడా!

తెలుగు చిత్ర పరిశ్రమను కనీవినీ ఎరుగని నష్టాల్లోకి నెట్టేసిన కరోనా మహమ్మారి కోరల నుంచి విముక్తి ఎప్పుడనేది అర్థం కావడం లేదు. కరోనాతో సహజీవనం తప్పదనుకుని తగిన జాగ్రత్తలతో షూటింగ్స్ చేసేద్దామని అనుకున్న వాళ్లు…

తెలుగు చిత్ర పరిశ్రమను కనీవినీ ఎరుగని నష్టాల్లోకి నెట్టేసిన కరోనా మహమ్మారి కోరల నుంచి విముక్తి ఎప్పుడనేది అర్థం కావడం లేదు. కరోనాతో సహజీవనం తప్పదనుకుని తగిన జాగ్రత్తలతో షూటింగ్స్ చేసేద్దామని అనుకున్న వాళ్లు కూడా పెరుగుతోన్న కేసులకి తోడు అమితాబ్ కుటుంబమే కరోనా బారిన పడడంతో బెంబేలెత్తిపోయారు.

ఇప్పుడు రిస్క్ తీసుకోవడం కంటే నష్టాన్ని పంటి బిగువున భరించి ఒకేసారి అన్నీ సర్దుకునాే్నక మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ యేడాదిని జంట ఘన విజయాలతో మొదలు పెట్టిన తెలుగు చిత్ర పరిశ్రమకు ఇక మిగిలిన నెలల మీద ఆశలు సన్నగిల్లిపోయాయి. ఈ ఏడాది చివరి వరకు పరిస్థితులు కుదుటపడవని భావిస్తున్నారు. అయితే ఈ నష్టం ఈ ఒక్క ఏడాదితో అయిపోయేది కాదు.

నిర్మాణంలో వున్న పెద్ద సినిమాల్లో వకీల్ సాబ్ తప్ప ఏదీ దగ్గర్లో విడుదలయ్యే అవకాశమే లేదు. మహేష్ ‘సర్కారు వారి పాట’, అల్లు అర్జున్ ‘పుష్ప’ వచ్చే యేడాదిలోనే సెట్స్ మీదకు వెళతాయి. అంటే నెక్స్‌ట్ ఇయర్ చివరకు గానీ విడుదలయ్యే అవకాశముండదు. అలాగే చిరంజీవి ఆచార్య, ప్రభాస్ రాధేశ్యామ్ కూడా వచ్చే వేసవిలోగా విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఇక ఆర్.ఆర్.ఆర్. వచ్చేదయితే 2022లోనే అనేస్తున్నారు.

థియేటర్లు తెరిచినా కానీ పెద్ద సినిమాలు విడుదల కాకపోతే మార్కెట్ కుదురుకునే అవకాశముండదు. కాబట్టి తెలుగు చిత్ర పరిశ్రమకు ఇప్పట్నుంచి కనీసం ఒక ఏడాది పాటు కరోనా వేధింపులు తప్పవు. 

పవర్ స్టార్ సంచలన టీజర్