ముగ్గురు దర్శకులు హీరో విజయ్ దేవరకొండ కు కథ చెప్పి ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ కాంపిటీషన్ లోంచి ఇద్దరు దర్శకులు తప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
పరుశురామ్, గౌతమ్ తిన్ననూరి, హరీష్ శంకర్ పేర్లు బలంగా వినిపించాయి. అయితే పరుశురామ్ కు హీరో చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే హరీష్ శంకర్ కు తెరి రీమేక్ కు పవన్ ఓకె చెప్పారని వార్తలు వచ్చాయి. అంటే ఈ ఇద్దరూ పోటీ లోంచి తప్పుకున్నట్లే.
ఇక మిగిలింది గౌతమ్ తిన్ననూరి నే. ప్రస్తుతం విజయ్ కోసం స్క్రిప్ట్ తయారుచేసే పనిలో వున్నారు. రామ్ చరణ్ కోసం చేసిన ఫ్యూచరిస్టిక్ స్క్రిప్ట్ పక్కన పెట్టారు. విజయ్ కోసం ఫ్యామిలీ స్టోరీ రెడీ చేస్తున్నారు. ఇది కనుక ఓకే అయితే సితార సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.
వాస్తవానికి ఈ ముగ్గురు దర్శకుల పేర్లు మాత్రమే కాదు. ఇంకా మరి కొన్ని పేర్లు కూడా విజయ్ తో సినిమా అంటూ వినిపించాయి. కానీ అవేవీ అంత బలంగా వినిపించలేదు.