వైసీపీ మీద స్వామి ధర్మాగ్రహం.. ?

విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర స్వామీజీ ఆరు నెలల పాటు ఉత్తర భారతాన ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. ఆయన తాజాగా విశాఖ వచ్చారు. పీఠంలో స్వామి విడిది చేశారు. రాజకీయ కోలాహలం కూడా మళ్ళీ…

విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర స్వామీజీ ఆరు నెలల పాటు ఉత్తర భారతాన ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. ఆయన తాజాగా విశాఖ వచ్చారు. పీఠంలో స్వామి విడిది చేశారు. రాజకీయ కోలాహలం కూడా మళ్ళీ పెరుగుతోంది.

ఇవన్నీ ఇలా ఉంటే ఈ మధ్యలో చాలానే ఏపీలో జరిగాయి. టీటీడీలో అధిక సంఖ్యలో జంబోజెట్ తరహాలో మెంబర్స్ ని నియమించారు. అఫ్ కోర్స్ దాన్ని కోర్టు కొట్టేసింది. మరో వైపు టీటీడీ సహా ఆలయాల విషయంలో విపక్షాల విమర్శలు సాగుతూనే ఉన్నాయి. 

ఇపుడు అన్నింటికీ మించి బ్రాహ్మణ కార్పోరేషన్ ని తీసుకొచ్చి బీసీ కారొపరేషన్ లో చేర్చడం పైన ఆ వర్గం గుర్రుగా ఉంది. మరో వైపు ఓసీ బ్రాహ్మణులను బీసీల్లో కలిపేస్తారా అంటూ బీసీలూ ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపధ్యంలో పీఠం తాజాగా ఘాటుగానే స్పందించింది. బీసీ కార్పోరేషన్ లో బ్రాహ్మణ కార్పోరేషన్ని చేర్చడాన్ని తక్షణ విరమించుకోవాలని పీఠం తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఆందోళన చేపడతామని స్వామీజీ హెచ్చరించారు.  

మొత్తానికి చూస్తే వైఎస్ జగన్ సర్కార్ మీద స్వామీజీ ధర్మాగ్రహం ప్రదర్శించారని అంటున్నారు. మరి ఇది ఎంత దూరం వెళ్తుంది అన్నది చూడాలి. ఈ లోగా ప్రభుత్వం సర్దుకుంటుందా అన్నది కూడా ఆలోచించాలి.