అశోక్ బాబాయి మీద ఊర్మిళ ఉరుములు

బాబాయ్ అంటే అశోక్ గజపతిరాజు. విజయనగరం పూసపాటి సంస్థానానికి ఏకైక వారసుడిగా నాడు చంద్రబాబు చేత  ఆమోద ముద్ర వేయించుకుని అయిదేళ్ళ పాటు మాన్సాస్ ట్రస్ట్ ని పాలించారు. అయితే అన్ని రోజులూ ఒకేలా…

బాబాయ్ అంటే అశోక్ గజపతిరాజు. విజయనగరం పూసపాటి సంస్థానానికి ఏకైక వారసుడిగా నాడు చంద్రబాబు చేత  ఆమోద ముద్ర వేయించుకుని అయిదేళ్ళ పాటు మాన్సాస్ ట్రస్ట్ ని పాలించారు. అయితే అన్ని రోజులూ ఒకేలా ఉండవు. ఇపుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది.

దాంతో అసలైన వారసులు వరసగా  బయటకు వస్తున్నారు. సంచయిత గజపతిరాజు తన బాబాయి పదవిలో ఇపుడు కుదురుకున్నారు. ఆమె సింహాచలం ట్రస్ట్ తో పాటు మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా ఆరు నెలల క్రితం నియమితులయ్యారు. . దాని మీద అశోక్ గజపతి కోర్టుకు వెళ్ళారు

ఆ కధ అలా ఉంటే ఇపుడు ఆనందగజపతి రాజు రెండవ భార్య సుధా గజపతిరాజు కుమార్తె ఊర్మిళ గజపతిరాజు రంగప్రవేశం చేశారు. తన తండ్రి ఆనంద్ ఆశయాలు గత అయిదేళ్ళుగా మాన్సాస్ ట్రస్ట్ అసలు నెరవేర్చలేదంటూ ఆమె నేరుగా బాబాయ్ అశోక్ మీదనే బాణాలు వేశారు.

తన తండ్రి చనిపోయిన తరువాత బాబాయి అశోక్ నియామకం అంతా ఏకపక్షంగా సాగిందని కూడా ఆమె ఆరోపించారు. కనీసం తమతో సంప్రదించలేదని, బాబాయికి మాన్సాస్ బాధ్యతలు చంద్రబాబు సర్కార్ ఒక్క ఉత్తర్వుతో  అప్పగించేసిందని కూడా ఆమె విమర్శించారు.

ఇపుడు తన తండ్రి ఆశలసాధన కోసం తాను చేయాల్సింది చేస్తానని, మాన్సాస్ ట్రస్ట్ వారసత్వం కోసం తమ పోరాటం ఆగదని కూడా ఊర్మిళ‌ అంటున్నారు. అంతే కాదు, తాను అవసరం అనుకుంటే రాజకీయాల్లోకి వస్తానని ఆమె  చెబుతున్నారు. తన తండ్రి చనిపోయిన తరువాత బాబాయ్ ఆశోక్ కుటుంబాన్ని అంతా ఐక్యంగా ఉంచలేకపోవడం, అందరినీ కలుపుకుని పోకపోవడం వల్లనే ఈనాడు ఇలా జరిగిందని ఆమె పరోక్షంగా  సంచయిత గజపతిరాజు మీద కూడా విమర్శలు చేశారు.

మాన్సాస్ ట్రస్ట్ అధికారాలు సంచయిత చేతుల్లోకి వెళ్ళిపోవడానికి అశోక్ బాబాయ్ వైఖరి కారణం అన్నట్లుగా ఆమె కామెంట్స్ చేశారు. మొత్తానికి చూసుకుంటే ఒక అమ్మాయితోనే వేగలేకపోతున్న బాబాయ్ కి  ఇపుడు ఊర్మిళ‌ రూపంలో మరో అమ్మాయి సవాల్ చేస్తోంది. ఎలా తట్టుకుంటారో రాజావారు.

మిమ్మల్ని యాంకర్ గా తీసెయ్యాలి