ఉత్తరాంధ్రా ఎన్ని ముక్కలు?

ఇపుడు ఇదే హాట్ హాట్ చర్చగా ఉంది. ఎపుడైతే జిల్లాల విభజనకు, కొత్త జిల్లాల ఏర్పాటుకు వైసీపీ సర్కార్ ఆమోదముద్ర వేసిందో నాటి నుంచే ఉత్తరాంధ్రా జిల్లాల మీదనే అందరి చూపూ ఉంది. ఎందుకంటే…

ఇపుడు ఇదే హాట్ హాట్ చర్చగా ఉంది. ఎపుడైతే జిల్లాల విభజనకు, కొత్త జిల్లాల ఏర్పాటుకు వైసీపీ సర్కార్ ఆమోదముద్ర వేసిందో నాటి నుంచే ఉత్తరాంధ్రా జిల్లాల మీదనే అందరి చూపూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న శ్రీకాకుళం జిల్లాను ముక్కలు చేయవద్దంటూ అపుడే విన్నపాలు, ఆగ్రహాలు మొదలయ్యాయి.

దాంతో ఇపుడు అధ్యయన కమిటీని వైసీపీ సర్కార్ ఏర్పాటు చేసి అక్కడ కధను తేల్చుకోమంది. దాంతో శ్రీకాకుళం జిల్లా ఇలాగే ఉంటుందా లేక మూడు ముక్కలు అవుతుందా, అలా కనుక‌ అయితే ఏ ముక్క ఎందుకో కలుస్తుంది అన్నది ఒక చర్చగా రచ్చగా ఉంది.

శ్రీకాకుళాన్ని పార్లమెంట్ సరిహద్దుగా విడగొడితే రాజాం, ఎచ్చెర్ల, పాలకొండ వెళ్ళి విజయనగరం జిల్లాలో కలుస్తాయి. ఇక అరకు కాక  కొత్తగా గిరిజన జిల్లా కావాలని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ముఖ్యమంత్రి జగన్నే కోరారు. దాంతో అరకు ను రెండుగా విడగొట్టాలనుకుంటున్నారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కురుపాంని జిల్లా కేంద్రంగా  చేయాలని పుష్ప శ్రీవాణి భావిస్తున్నట్లుగా సమాచారం. అదే జరిగితే అందులోకి వెళ్ళి పాలకొండ కలుస్తుందని  చెబుతున్నారు. అలా శ్రీకాకుళం మూడు ముక్కలు కాక తప్పదని ఇప్పటి భౌగోళిక స్వరూపం చూడలేమని కూడా  అంటున్నారు.

మరో వైపు చూస్తే విశాఖ జిల్లాలో సచివాలయం పరిధిని మాత్రమే తీసుకుని ఒక కొత్త  జిల్లా చేస్తారని అంటున్నారు. అంటే విశాఖ కార్పొరేషన్ పరిధి వరకూ అన్న మాట. ఇక మిగిలిన విశాఖ సిటీతో పాటు, రూరల్ జిల్లా మొత్తాన్ని రెండు జిల్లాలుగా చేస్తారా అన్న చర్చ కూడా ఉంది. అలాగే అరకు రెండు జిల్లాలు అవుతోంది. ఈ విధంగా చూసుకుంటే ఇపుడు ఉత్తరాంధ్రా మూడు జిల్లాలుగా ఉన్నది కనీసంగా  ఆరేడు జిల్లాలుగా ముక్కలవుతుందని చెబుతున్నారు.

పైగా విశాఖకు రాజధాని రావడంతో చాలా మార్పులు చేర్పులు రాజకీయంగా, పాలనాపరంగా ఉంటాయని కూడా అంటున్నారు. మొత్తానికి ఈ జిల్లాల విభజనతో ఉత్తరాంధ్రాలో ఒకనాటి టీడీపీ కంచుకోట పూర్తిగా బీటలు వారడం ఖాయంగా కనిపిస్తోంది.

మిమ్మల్ని యాంకర్ గా తీసెయ్యాలి