నిన్న రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ దాదాపు గంట సేపు మాట్లాడారు. తన ఆయాసం, ఆవేశం, ఆక్రోశం అంతా వెళ్లగక్కుకున్నారు. వైసీపి నాయకులను, ముఖ్యమంత్రి ని పిచ్చి తిట్లు తిట్టారు. అయితే నేను వైసీపీ నాయకుల సమర్దకునిగా గాక ఒక సగటు సినీ అభిమానిగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఇది రాస్తున్నాను.
పవన్ కళ్యాణ్ వైసీపీ వారిని అడిగింది 'మీ నైతికత ఎంత? అని” పవన్ కళ్యాణ్ గారి నైతికత గురించి ఇప్పుడు మాట్లాడదాం. రాజకీయాల లోకి వచ్చాక సినిమాలు మానేస్తాను అని ఆయనే చెప్పారు. ఇక సినిమాల లోకి రాను అని పదే పదే ప్రకటించుకున్నారు. అప్పటికి ఆయన ఆజ్ఞతవాసి అనే కళాఖండం తీసి ప్లాప్ లలో ఉన్నారు.
ఆయనని సినిమాలు చేయొద్దు అని ఎవరూ అడగలేదు కూడా!! కానీ ఆయనే చెప్పుకున్నాడు. కానీ డబ్బులు ఎవరికి వద్దు? క్రితం సారి చిరంజీవి కూడా ఇలానే చెప్పారు. అయినా అన్నదమ్ములు ఇద్దరూ తిరిగి సినిమలలోకి వచ్చారు. మరి ఇది నైతికత ఎలా అయ్యంది పవనూ?? అసలు నైతికత గురుంచి మాట్లాడే కనీస అర్హత మీకుందా?
ఇక రెమ్యునరేషన్ తీసుకుని టాక్స్ కడుతున్నాం అని అన్నారు. మీరు ఎంత తీసుకుంటున్నారు? తీసుకున్నది మొత్తం వైట్ మనీ గానే తీసుకుంటున్నారా? మీరు దాదాపు గా 50 కోట్లు తీసుకుంటున్నారు అని ఇండస్ట్రీ టాక్. మరి దానికి మొత్తం పన్ను కడుతున్నారా? వివరాలు బయట పెట్టగలరా? పెట్టి అప్పుడు మాట్లాడండి.
పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తున్నారు అన్నారు. ఎవరు ఆపారండీ? రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ కేవలం మీ సినిమాలకు మాత్రమే పెట్టిందా? లేక అన్ని సినిమాలకు పెట్టిందా? రూల్స్ అన్ని సినిమాలకు ఉంటున్నప్పుడు మీ సినిమాలు ఆపేస్తున్నారు అని చెప్పడంలో వాస్తవికత ఎంత?
తెలంగాణ లో ఈ రూల్స్ లేవు అంటున్నారు. నిజమే! తెలంగాణ లో ఇంత దారుణం కూడా లేదు. పెద్ద హీరో సినిమా అనే ఒకే ఒక్క కారణం తో వారి సినిమాల టికెట్ రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచేయడం చంద్రబాబు ప్రభుత్సంలోనే మొదలు అయింది. జగన్ ప్రభ్యత్వం దానికి ముక్కు తాడు వేస్తుంది. అందులో తప్పేంటి?
తమరి ధన దాహానికి తోడుగా ప్రభాస్, రానా, రాం చరణ్, jr ఎన్టీఆర్ లను తెచ్చుకున్నావు. వారు కష్టపడితేనె డబ్బులు ఇస్తారు అన్నావు. నిజమే. వారి సినిమాలలో వారి కష్టం ఉంది. ముఖ్యంగా బాహుబలి, మగధీర, RRR లాంటి సినిమాలకు అంత బడ్జెట్ కూడా అయ్యింది. మరి తమరి వకీల్ సాబ్ కి అయిన బడ్జెట్ ఎంత??
పింక్ కేవలం పది కోట్లలోపే తయారయింది. వకీల్ సాబ్ ఎలా చూసుకున్నా 15 కోట్లు మించదు. కానీ తమరి 50 కోట్ల రెమ్యునరేషన్ తో దానిని 100 కోట్ల బడ్జెట్ సినిమాగా చేసేసారు. ఇష్టానుసారంగా టికెట్ రేట్లు పెట్టి జనాల ముక్కు పిండి వసూలు చేశారు. అంతేకాకుండా ఇన్చిన మాట కూడా తప్పి దిల్ రాజు గారు అనుకున్న డేట్ కు ముందే సినిమాను OTT లో వేసేసారు. మీరా నైతికత గురుంచి మాట్లాడేది?
అసలు మీ నాసిరకం సినిమాలకు 300-400 ఇచ్చి ఎందుకు టికెట్ కొనాలి. మీరు కష్టపడుతున్నారు సరే! జనాలకు మాత్రం తేరగా డబ్బులు రావడం లేదు కదా? మీ ఫాన్స్ ఎంత రేట్ పెట్టైనా సినిమా చూడాలి అనుకుంటే వారికి వేరే కౌంటర్ పెట్టి వసూలు చేసుకోండి. టికెట్ ముప్పై వేలు పెడతారో, మూడు లక్షలు పెడతారో మీ ఇష్టం, వారిష్టం. మీ పార్టీ ఫండ్ అలానే వసూలు చేశారు కదా. కానీ మీ ధన దాహాన్ని సామాన్య జనం ఎందుకు భరించాలి?
పెరట్లో గేదె ఈనినా అది నావల్లే అని చెప్పుకునే అలవాటు చంద్రబాబు గారికి ఉంది. క్రెడిట్ తనకన్నా ముందు ఎవరు తీసేసుకుంటారో అనే ఆతృతలో అసలు దేని క్రెడిట్ తీసుకోవలనుకుంటున్నారో చూడని బలహీనత ఆయనది. ఆయనకి పవన్ కళ్యాణ్ రివర్స్ లా ఉన్నారు. ఏది జరిగినా జగన్ మీద తోసేస్తున్నారు. నానీ ని థియేటర్ యజమానులు తిట్టడానికి, జగన్ కి ఏం సంబంధం? కొన్నాళ్ళు పోతే కరోనా కూడా జగన్ వలనే వచ్చింది అంటాడేమో ఈయన. మంచో, చెడో జగన్ చాలా మొండీవాడు. ఆయన “తెగేదాక లాగే” రకం కాదు. “తెగ్గొట్టి” చేతిలో పెట్టె రకం.
ఇన్నాళ్లకు ఆన్లైన్ పోర్టల్ లో టికెట్స్ సామాన్య ప్రజలకు అందుబాటు ధరలలో అమ్మే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇది మీలాంటి ధన దోపిడీ దారులకు అడ్డుకట్ట వేస్తుందేమో గాని ప్రజలకు మాత్రం ఇది చాలా ఉపయోగకరమైన పని.
గతంలో చిరంజీవి కూడా కార్మికులు నష్టపోతున్నారు అని మొసలి కన్నీరు కారుస్తూ ప్రభుత్వాలు ఆదుకోవాలి అని చెప్పారు. కార్మికులు నష్టపోవడానికి సినిమాలు తీయడం నిర్మాతలు ఏమైనా ఆపేసారా? డైరెక్టుగా ఎందుకు చెప్పరు? మీ ధన దాహానికి జగన్ ప్రభుత్వం అడ్డు కట్ట వేస్తుంది అని? “వింటేజ్” చిరంజీవి ని చూడాలి అనుకుంటే ఏ గ్యాంగ్ లీడరో, ఘరానా మొగుడో మరోసారి చూస్తాం. అంతేగాని వింటేజ్ చిరంజీవి అంటూ డెబ్భై ఏళ్ల ముసలాడికి లుంగీ కట్టించి ఆ సినిమాకు 400 వసూలు చేస్తాము అంటే మాత్రం మేము ఒప్పుకొము. పచ్చిగా ఉన్నా ఇదే నిజం.
చివరిగా ఒక మాట. రిపబ్లిక్ సిన్మాలోలా రాజ్యంగం చెప్పినట్లు గా రాజకీయాలలో నడుస్తున్నాను అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. పార్టీ నిర్మాణం పూర్తి చేయకుండానే ప్రక్క పార్టీలకు వాయిద్య కారుడిలా ప్రవర్తించమని ఏ రాజ్యాంగం లో రాసి ఉంది పవన్ గారు? ఇప్పటికే మిమ్మల్ని ప్రీ పైడ్ అంటున్నారు జనం. జనం తెలివి తక్కువ వారు ఏమీ కాదు. మీ వేషాలు చూసే మిమ్మల్ని రెండు దగ్గర్ల ఓడించారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నిజాయితీగా పని చేస్తే రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఎప్పటికీ ప్రీ పైడ్ గానే ఉండిపోవలసి వస్తుంది. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. కానీ మీ సినిమాలకు ఎంత పడితే అంత వసూలు చేస్తామంటే మాత్రం ఊరుకోము.
లాస్ట్ పంచ్ మనదే అయితే ఆ కిక్కే వేరప్పా!! కనుక లాస్ట్ పంచ్ కూడా వేసేస్తున్నాను. స్పైసీ గా కావాలనుకుంటే మీడియా వాళ్ళు అంటూ పాజ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు తన స్పీచ్ లో. కొంపదీసి “నా మూడు పెళ్లిళ్ల మీద రాయండి” అని అనేస్తాడేమో ఈయన అనుకున్నా. ఎందుకంటే ఈయన అసలే తిక్క మేళం కదా. అసలే నాకు తిక్కుంది దానికో లెక్కుంది అని చెప్పుకొని తిరిగే రకమాయే! మొత్తానికి ఆ మాట అనకుండా రక్షించాడు పవన్ కళ్యాణ్.
భాస్కర్ కిల్లి.