మోస్ట్ ప్రామిసింగ్ సినిమా అని యంగ్ ఆడియన్స్ ఎదురుచూస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ దసరా బరిలోకి దిగుతోంది.
వాస్తవానికి అక్టోబర్ 8న విడుదల అని అనుకున్నారు. ఆ మేరకు పాటలు అవీ వదిలారు. అవన్నీ బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు డైరక్ట్ గా దసరా బరిలోకి దిగుతున్నారు. పూజాహెగ్డే-అఖిల్ కెమిస్ట్రీ, బొమ్మరిల్లు భాస్కర్ నావెల్ యూత్ పాయింట్ బ్యాచులర్ కు ప్లస్ గా వుండి ఈ సినిమాకు బజ్ తెస్తున్నాయి.
అక్టోబర్ 15న సినిమా విడుదల ప్లాన్ చేసారు. ఆంధ్రలో కొత్త టికెట్ రేట్లు, 50 శాతం ఆక్యుపెన్సీ మీద సరైన డేట్ అన్నది ఇవ్వాళ, రేపు కీలకం అయిపోయింది. మొదటి మూడు రోజులు ఫిఫ్టీ పర్సంట్ మీద అన్నీ ఫుల్స్ రావాలి. అలా రావాలి అంటే దసరా సరైన డేట్ అవుతుంది.
అందుకే అన్నీ ఆలోచించి దసరా బరిలోకి బ్యాచులర్ ను దింపుతున్నారు. అదే డేట్ కు నాగశౌర్య-రీతూ వర్మ కాంబో వరుడుకావలెను కూడా విడుదల అవుతుంది. దసరా కాబట్టి రెండు మీడియం సినిమాలు వున్నా పెద్దగా సమస్య కాదు.