టాలీవుడ్ అంటే ఆయ‌నొక్క‌రేనా?

తెలుగు సినిమా రంగ‌మంటే తాను, త‌న కుటుంబం మాత్ర‌మేన‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అనుకుంటున్నారు. నిన్న‌టి ఓ సినిమా ఫంక్ష‌న్‌లో ఆయ‌న మాట‌లు వింటే ఇదే అర్థమ‌వుతుంది.  Advertisement త‌న‌ను ఇబ్బంది పెట్టేందుకు మొత్తం టాలీవుడ్‌కే…

తెలుగు సినిమా రంగ‌మంటే తాను, త‌న కుటుంబం మాత్ర‌మేన‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అనుకుంటున్నారు. నిన్న‌టి ఓ సినిమా ఫంక్ష‌న్‌లో ఆయ‌న మాట‌లు వింటే ఇదే అర్థమ‌వుతుంది. 

త‌న‌ను ఇబ్బంది పెట్టేందుకు మొత్తం టాలీవుడ్‌కే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆటంకాలు సృష్టిస్తున్న‌ట్టు ఆయ‌న విమ‌ర్శించారు. సినిమాల్లో న‌టించ‌య్యా బాబు అంటే…తెర వెనుకే ప‌వ‌న్‌క‌ల్యాణ్ అద్భుత న‌ట‌న ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నే విమ‌ర్శ‌లొస్తున్నాయి.

ఏ మాత్రం సంబంధం లేని వేదిక‌పై వ్య‌క్తిగ‌త రాజ‌కీయ ఎజెండాను ఆయ‌న అమ‌లు ప‌రిచార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతు న్నాయి. ‘వకీల్‌సాబ్‌’ దిల్‌రాజు నాతో ఎందుకు చేశారు? నాతో ఆ సినిమా తీయకపోతే ఈపాటికే ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలు విడుదలై ఉండేవి. 

మీరు రెడ్డే, ఏపీ సీఎం కూడా రెడ్డే. జ‌గ‌న్‌కు రెడ్లు అంటే బాగా ఇది క‌దా…అదేదో మీరు మీరు చూసుకోండి’ అంటూ వెక‌లి హావ‌భావాల‌తో ఆయ‌న చెప్పిన తీరు వెగ‌టు పుట్టిస్తోంది. 

తాను కులాలు, మ‌తాల‌కు అతీత‌మంటూ ఒక‌వైపు నీతులు చెప్పే ప‌వ‌న్‌, ఆచ‌ర‌ణ‌కు వ‌చ్చే స‌రికి ప‌చ్చి రెడ్ల వ్య‌తిరేకిగా త‌న‌ను తాను నిరూపించుకున్నారు.

‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలు ఆపేసి లక్షల మంది పొట్ట గొడుతున్నారు. కావాలంటే నా సినిమాలను ఆపేయండి. మిగతా వారి సినిమాలను వదిలేయండి. పవన్‌కల్యాణ్‌ సినిమాను ఆపేసినా, అతనొచ్చిన చిత్ర పరిశ్రమని ఆపేసినా అందరూ భయపడి పోయి… తమ దగ్గరికొస్తారని వైసీపీ నాయకులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు జాగ్రత్త’ అంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. 

ఏమిటీ హెచ్చ‌రిక‌లు. ఇలాంటివి ఎల్లో మీడియాకు బ్యాన‌ర్ హెడ్డింగ్‌లు పెట్టుకోడానికి త‌ప్ప‌, ఇత‌ర‌త్రా ఎందుకూ ప‌నికిరావు. తాను తెర‌పై మాత్ర‌మే హీరో అనే విష‌యాన్ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌రిచిన‌ట్టున్నారు. 

రియ‌ల్ లైఫ్‌లో కూడా హీరో కావ‌డానికి ఇదేమీ సినిమా కాదు. ఎన్నిక‌ల్లో నిలిచి రెండు చోట్లా బొక్క బోర్లా ప‌డ్డ ప‌వ‌న్‌కు ఇంకా జ్ఞానోద‌యం కాన‌ట్టుంది. అందుకే ఈ వింత పోక‌డ‌. 

ముందు టాలీవుడ్ అంటే తాను, త‌న కుటుంబ మాత్ర‌మే అనే భ్ర‌మ నుంచి బ‌య‌టికి రావాలి. అప్పుడు గానీ ఆయ‌న మాట‌ల‌కు, చేష్ట‌ల‌కు ఒక లెక్క వుంటుంది. అంత వ‌ర‌కూ ఇలాంటి అర్థంప‌ర్థం లేని మాట‌ల‌ను జ‌నాలు భ‌రించాల్సిందే.