నిర్మాతలు రెడీ.. హీరోలతోనే పేచీ

ఏ సినిమాకి అయినా లాభనష్టాలు భరించేది నిర్మాతే కనుక తన చిత్రానికి బిజినెస్ పరంగా ఏది బెస్ట్ అనేది అతనికే తెలుసు. అందుకే ప్రస్తుత క్రైసిస్‌లో ఓటిటి రిలీజ్ బెస్ట్ అని చాలా మంది…

ఏ సినిమాకి అయినా లాభనష్టాలు భరించేది నిర్మాతే కనుక తన చిత్రానికి బిజినెస్ పరంగా ఏది బెస్ట్ అనేది అతనికే తెలుసు. అందుకే ప్రస్తుత క్రైసిస్‌లో ఓటిటి రిలీజ్ బెస్ట్ అని చాలా మంది నిర్మాతలు భావిస్తున్నారు. థియేటర్లు ఓపెన్ అవడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. అలాగే థియేటర్లు తెరచినా మునుపటి మాదిరి స్పందన ఇప్పట్లో కష్టమవుతుంది.

అందుకే ఓటిటిల నుంచి మంచి డీల్ వస్తే సేల్ చేసేయాలని నిర్మాతలు చూస్తున్నారు. కానీ హీరోలు మాత్రం అందుకు సుముఖంగా లేరని ఇన్‌సైడ్ న్యూస్. ‘వి’ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయడానికి నాని అసలు ఇష్టపడడం లేదట. దిల్ రాజుకి ఆర్థిక పరంగా నష్టం జరుగుతున్నా కానీ పారితోషికంలో అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చుననేది నాని అభిమతమట.

సాలిడ్ మార్కెట్ వున్న తనలాంటి హీరో సినిమా ఓటిటిలో విడుదలయితే అది భవిష్యత్ చిత్రాలపై ప్రభావం పడుతుందని నాని భావిస్తున్నట్టు టాక్ వుంది. రామ్ కూడా ఇలాగే ఆలోచిస్తున్నాడని, రెడ్ చిత్రానికి తన పెదనాన్నే నిర్మాత కనుక ఓటిటి రిలీజ్ కోసం ఎలాంటి ఆఫర్స్ వచ్చినా రిజెక్ట్ చేస్తున్నాడని, ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన మార్కెట్‌ని స్టేబులైజ్ చేసుకునే అవకాశాన్ని అతను ఎట్టి పరిస్థితుల్లోను వదులుకునేందుకు సిద్ధంగా లేడని సమాచారం. 

మిమ్మల్ని యాంకర్ గా తీసెయ్యాలి

టీటీడీలో 140 మందికి పాజిటివ్