ఫ్లాప్ అయిన వాళ్లకోసం కొత్త గ్రౌండ్

టీవీ రంగాన్ని ఎలాగయితే సినిమా వాళ్లు చిన్నగా చూస్తారో ఓటిటిని కూడా అలాగే చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ కోసం బడా స్టార్లు సినిమాలు చేసే హాలీవుడ్ తరహా అవుట్‌లుక్ ఇక్కడ ఇంకా రాలేదు. అంతెందుకు… థియేటర్లు…

టీవీ రంగాన్ని ఎలాగయితే సినిమా వాళ్లు చిన్నగా చూస్తారో ఓటిటిని కూడా అలాగే చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ కోసం బడా స్టార్లు సినిమాలు చేసే హాలీవుడ్ తరహా అవుట్‌లుక్ ఇక్కడ ఇంకా రాలేదు. అంతెందుకు… థియేటర్లు మూత పడి, ఓటిటి రిలీజ్ ఒకటే ఆప్షన్‌గా మిగిలినా కానీ థియేటర్లు తెరుచుకునే వరకు వేచి చూడాల్సిందే అంటూ హీరోలు డిసైడ్ అయ్యారు.

డైరెక్టర్లు కూడా తమ సినిమాలకు థియేట్రికల్ రిలీజ్ కావాల్సిందేనని నిర్మాతలపై ఒత్తిడి పెంచుతున్నారు. అయితే ఓటిటి కూడా సినిమా థియేటర్లకు ప్రత్యామ్నాయమనేది నిర్మాతలు గ్రహించారు. అందుకే ఓటిటి కంటెంట్ ప్రొడ్యూస్ చేయడంపై ఫోకస్ పెడుతున్నారు. కాకపోతే ఆ కంటెంట్ చేయడానికి ఫామ్‌లో ఉన్న దర్శకులు లేదా నటులు అందుబాటులో లేరు.

అందుకే ఫ్లాప్స్‌తో వెనుకబడిన హీరోలు, దర్శకులు, హీరోయిన్లను అప్రోచ్ అవుతున్నారు. థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు ఆయా నటులు, దర్శకుల ప్రస్తుత ఫామ్, క్రేజ్ కూడా అవసరం కనుక వాళ్లకు మాస్ మార్కెట్ కంటే ఇది బెస్ట్ గ్రౌండ్ అనిపిస్తోంది. ఈ లాక్‌డౌన్ వల్ల ప్రయోజనం జరిగిందెవరికైనా వుంటే అది వీళ్లేక అనవచ్చు. 

మిమ్మల్ని యాంకర్ గా తీసెయ్యాలి

టీటీడీలో 140 మందికి పాజిటివ్