నాగశౌర్య-రీతూ వర్మ కాంబినేషన్ లో కొత్త దర్శకురాలు లక్ష్మీ సౌజన్య అందిస్తున్న సినిమా వరుడు కావలెను.
ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్ అన్నీ ప్రామిసింగ్ గా వుండడంతో కొంత బజ్ వచ్చింది. అయితే ఫ్యామిలీలు వస్తాయా? రావా? థియేటర్ కు, అనే ఆలోచనతో సినిమాను అలా వుంచారు.
లవ్ స్టోరీ సినిమాకు ఆడియన్స్ ఫస్ట్ డే రెస్పాన్స్ చూసి, ఇప్పుడు డేట్ అనౌన్స్ చేసేసారు. అక్టోబర్ 15న వరుడు కావలెను విడుదలవుతుంది.
కలర్ ఫుల్ విజువల్ ట్రీట్ గా ఈ సినిమాను కాస్త ఎక్కువ బడ్జెట్ తోనే నిర్మించారు. ఇటీవల కాలంలో శౌర్య సినిమాకు దాదాపు 14 కోట్లు ఖర్చు చేయడం ఇదే.
విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమాకు నాగవంశీ సూర్యదేవర నిర్మాత.