రామ్ చరణ్ – బుచ్చిబాబు – కొత్త బ్యానర్

ఆర్ఆర్ఆర్ తరువాత ఏదో తేడా వచ్చింది. ఎక్కడో ప్లానింగ్ మిస్ ఫైర్ అవుతోంది. దాంతో ఎన్టీఆర్ చేతుల నుంచి సినిమాలు జారుతున్నాయి. కొరటాల శివతోనే సినిమా చేయాలని డిసైడ్ కావడం, ఆ స్ఖ్రిప్ట్ రెడీ…

ఆర్ఆర్ఆర్ తరువాత ఏదో తేడా వచ్చింది. ఎక్కడో ప్లానింగ్ మిస్ ఫైర్ అవుతోంది. దాంతో ఎన్టీఆర్ చేతుల నుంచి సినిమాలు జారుతున్నాయి. కొరటాల శివతోనే సినిమా చేయాలని డిసైడ్ కావడం, ఆ స్ఖ్రిప్ట్ రెడీ కాకపోవడంతో ముందుగా ఒప్పుకున్న ఉప్పెన బుచ్చిబాబు సినిమా చేతులు మారిపోయింది. అంతకు ముందు ఏం జరిగిందో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా క్యాన్సిల్ అయింది.

బుచ్చిబాబు అలా ఎన్టీఆర్ కోసం తపస్సు చేస్తూ ఆగిపోకుండా రామ్ చరణ్ దగ్గరకు వెళ్లిపోతున్నాడని కూడా వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆఖరికి అదే పైనల్ అయింది. ఏ బలమైన కథ అయితే ఎన్టీఆర్ కు చెప్పాడో, అదే కథను రామ్ చరణ్ కు చెప్పడం, ఓకె అనడం అయిపోయింది.

కానీ ట్విస్ట్ ఏమిటంటే మైత్రీ మూవీస్ సంస్థ నే బుచ్చిబాబు-ఎన్టీఆర్ ప్రాజెక్టు ను ప్రపోజ్ చేసింది. కానీ అదే కథ, అదే డైరక్టర్..కానీ మైత్రీ మూవీస్ మాత్రం సినిమాను నిర్మించడం లేదు. మైత్రీ మూవీస్ తో సన్నిహిత సంబంధాలు వున్న సతీష్ కిలారు ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. ఓ కొత్త బ్యానర్ ను ఆయన స్టార్ట్ చేస్తున్నారు.

తొలి సినిమానే 150 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మించబోతున్నారు.