అది పురుష్ – హనుమాన్

ఇవ్వాళ, రేపు సినిమా ఎలా వుంటుంది అన్నది కాదు పాయింట్. ఫస్ట్ లుక్, టీజర్ ఎలా వచ్చింది అన్నది కీలకం. టీజర్ ను బట్టే సినిమా లెవెల్ ను అంచనా వేస్తున్నారు. అందుకే టీజర్…

ఇవ్వాళ, రేపు సినిమా ఎలా వుంటుంది అన్నది కాదు పాయింట్. ఫస్ట్ లుక్, టీజర్ ఎలా వచ్చింది అన్నది కీలకం. టీజర్ ను బట్టే సినిమా లెవెల్ ను అంచనా వేస్తున్నారు. అందుకే టీజర్ కట్ విషయంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు దర్శకులు, నిర్మాతలు. ముఖ్యంగా సిజి వర్క్, గ్రాఫిక్స్ వున్న సినిమాలు అయితే టీజర్ రాగానే భవిష్యత్ ను తేల్చేస్తున్నారు.

ఆ మధ్య వచ్చిన ఆదిపురుష్ సినిమా భవిష్యత్ నే అయోమయంలోకి తోసేసింది దాని టీజర్. దాని దెబ్బకు విడుదల డేట్ నే వెనక్కు పోయింది. మొత్తం క్వాలిటీ మీదే అనుమానం వచ్చేసింది. ఈ రోజు విడుదలయిన హనుమాన్ టీజర్ ఈ గాయాన్ని మళ్లీ మరోసారి కెలికింది. హనుమాన్ టీజర్ క్వాలిటీ చూసి, జనాలు మరోసారి ఆదిపురుష్ టీజర్ ను ఆడుకోవడం మొదలుపెట్టారు. నెట్ లో ఈ రోజు ఇదే హాట్ టాపిక్.

హనుమాన్ టీజర్ లో సినిమా ఎలా వుండబోతొంది అన్న క్లారిటీ తో పాటు, విజువల్స్ కూడా ఆకట్టుకునేలా చేసారు. అసలే ఇప్పుడు భక్తి సినిమాల ట్రెండ్ నడుస్తోంది. రామ్..రామ్ అంటూ రామనామజపం, హనుమంతుడి మీద తీసిన డివోషనల్ ఫాంటసీ కావడంతో యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. కార్తికేయ 2 సినిమా చిన్న హీరో అయిన నిఖిల్ ను వందకోట్ల క్లబ్ లోకి చేర్చేసింది. జస్ట్ డివోషనల్ టచ్ చేసిన వండర్ అది.

ఇప్పుడు హనుమాన్ కూడా అలాగే కనిపిస్తోంది. హీరో సంగతి పక్కన పెడితే కాన్సెప్ట్, గ్రాఫిక్స్, విజువల్స్ అన్నీ కలిసి టీజర్ లో మ్యాజిక్ చేసాయి.