అనామ‌కురాలి నుంచి అత్య‌ధిక పారితోష‌కం వ‌ర‌కూ!

పుట్టింది హాంకాంగ్ లో, పెరిగింది వివిధ దేశాల్లో, ఫ్యామిలీ ఉండేది లండ‌న్ లో, అధికారికంగా బ్రిటీష్ పౌరురాలు, ఇండియ‌న్ మూలాలు.. కెరీర్ ఆరంభంలో విమ‌ర్శ‌లు, అంత‌లోనే బాలీవుడ్ లో అత్య‌ధిక పారితోష‌కం తీసుకుంటున్న స్టార్…

పుట్టింది హాంకాంగ్ లో, పెరిగింది వివిధ దేశాల్లో, ఫ్యామిలీ ఉండేది లండ‌న్ లో, అధికారికంగా బ్రిటీష్ పౌరురాలు, ఇండియ‌న్ మూలాలు.. కెరీర్ ఆరంభంలో విమ‌ర్శ‌లు, అంత‌లోనే బాలీవుడ్ లో అత్య‌ధిక పారితోష‌కం తీసుకుంటున్న స్టార్ గా గుర్తింపు, వివాదాలు- ప్రేమ‌క‌థ‌లు, బ్రేక‌ప్ లు, రూమ‌ర్లు.. ఇలా ఎన్నో విష‌యాలున్నాయి క‌త్రినాకైఫ్ గురించి చెప్పుకోవ‌డానికి. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో హ‌య్యెస్ట్ పెయిడ్ ఆర్టిస్టుల్లో ఒక‌రిగా నిలుస్తూ ఉన్న క‌త్రినాకు నేటితో 37 సంవ‌త్స‌రాలు నిండుతున్నాయి.

ఆ మ‌ధ్య త‌న‌ను తాను రాహుల్ గాంధీతో పోల్చుకుని కాంగ్రెస్ వాళ్ల‌కు కోపం తెప్పించింది క‌త్రినా. త‌ను రాహుల్ గాంధీ లాగా అని, హాఫ్ ఇండియ‌న్ అని ఈమె చెప్పింది. అలా చెప్పుకుంటే రాహుల్ సంతోష‌ప‌డ‌తాడ‌ని ఈమె అనుకున్న‌ట్టుంది అయితే అలాంటి మాట‌లు కాంగ్రెస్ వాళ్లు సంతోషించేవి కావ‌ని క‌త్రినాకు ఆ త‌ర్వాత అర్థ‌మైంది! 

లండ‌న్ లో మోడ‌లింగ్ చేసుకుంటూ ఉండిన క‌త్రినాను అక్క‌డ ఒక బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ చూసి హిందీ సినిమాలో చేసే ఆఫ‌ర్ ఇచ్చాడు. ఆ సినిమాలో క‌త్రినా చేత విప‌రీత స్థాయిలో ఎక్స్పోజింగ్ చేయించారు. 17 యేళ్ల కింద‌ట‌.. ఆ సినిమా సంచ‌ల‌నం రేపింది. క‌మ‌ర్షియ‌ల్ గా అట్ట‌ర్ ఫ్లాప్ అయిన ఆ సినిమా క‌త్రినా వాళ్ల అలా గుర్తుండి పోతుంది!

ఆ త‌ర్వాత బాలీవుడ్ ఈమెను ఆద‌రించలేదు. తెలుగు వారికి మాత్రం ఈమె న‌చ్చింది. కోరి మ‌ళ్లీశ్వ‌రి సినిమాలో న‌టింప‌జేసుకున్నారు. అప్ప‌ట్లోనే 75 ల‌క్ష‌ల రూపాయ‌ల స్థాయి పారితోష‌కంతో సెన్షేష‌న్ క్రియేట్ చేసింది క‌త్రినా. కొన్నాళ్ల కింద‌ట ఆమెకు అంత పారితోష‌కం త‌ప్పైపోయింద‌ని నిర్మాత సురేష్ బాబు ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఏ నిర్మాత కూడా క‌త్రినాను హీరోయిన్ గా బుక్ చేసుకోలేని స్థితిలో ఉంది క‌త్రినా పారితోష‌కం!

కెరీర్ ఆరంభంలో క‌త్రినాను ఆద‌రించింది సౌతిండియా ప‌రిశ్ర‌మలే. తెలుగులో అల్ల‌రి పిడుగు అని మ‌రో సినిమాలో న‌టించింది. మ‌ల‌యాళంలో మ‌మ్ముట్టీతో ఒక సినిమాలో న‌టించింది. ఈమెకు న‌ట‌న రాద‌ని ఆ సినిమా స‌మీక్ష‌ల్లో క్రిటిక్స్ తేల్చారు. అయినా క‌త్రినా అవ‌కాశాల‌ను మాత్రం ఎవ్వ‌రూ ఆప‌లేకపోయారు. 2007 లో వ‌చ్చిన బాలీవుడ్ సినిమా న‌మ‌స్తే లండ‌న్  తో క‌త్రినా గ‌తి మారిపోయింది. బాలీవుడ్ లో స్టార్ అయ్యింది.  వెల్క‌మ్, పార్ట్ న‌ర్ సినిమాలు ఈమెను మ‌రో స్థాయికి తీసుకెళ్లాయి. అక్క‌డ నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేక‌పోయింది. 

మ‌రోవైపు వ్య‌క్తిగ‌త జీవితంలో ప్రేమ‌లు, బ్రేక‌ప్ లు క‌త్రినాను వార్త‌ల్లో నిలిపాయి. స‌ల్మాన్ ఖాన్ తో ప్రేమాయ‌ణం, ఆ త‌ర్వాత ర‌ణ్ బీర్ క‌పూర్ తో ల‌వ్ ఎఫైర్ సుదీర్ఘ కాలం పాటు కొన‌సాగాయి. అయితే అవి రెండూ బ్రేక‌ప్ అయ్యాయి. ప్ర‌స్తుతం మ‌రో బాలీవుడ్ హీరోతో ఈమె ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ చేస్తోంద‌నే పుకార్లున్నాయి. ఏతావాతా ఆమెకు హిందీరాదు, న‌ట‌న అంత‌క‌న్నా రాదు అని తేల్చేసిన ద‌శ నుంచి.. ఆమే స్టార్ హీరోయిన్, అత్య‌ధిక పారితోష‌కం తీసుకుంటున్న న‌టీమ‌ణి అని కీర్తి పొందే వ‌ర‌కూ వ‌చ్చింది క‌త్రినా. 17 యేళ్ల ఆమె సినీ ప్ర‌యాణం అలా సాగించింది. క్రేజీ హీరోయిన్ గా కొన‌సాగుతూ ఉంది.

దిమ్మతిరిగే షో మొదలవుతుంది