మోదీ వచ్చి 8 ఏళ్లయింది. చాలా విజయాలు సాధించినట్టు ప్రకటనలు వస్తున్నాయి. బీజేపీ పాలనలో ఇది కూడా సాధించాం.
1) 8 ఏళ్లలో 80 లక్షల కోట్లు అప్పు చేసాం
2) 32 మంది ప్రాణత్యాగం చేసిన విశాఖ ఉక్కు కార్పొరేట్ చేతుల్లోకి వెళుతోంది
3) వ్యవసాయంపై 3 దుష్టచట్టాలు తెచ్చి, ఢిల్లీలో ఏడాది పాటు రైతులతో ఆందోళన చేయించి విరమించుకున్నారు
4) కనీస మద్దతు ధరపై కమిటీ వేస్తామని చెప్పి 6 నెలలైంది
5) విదేశాల్లో వున్న నల్లధనం తెస్తామన్నారు. రూపాయి కూడా రాలేదు
6) 2014లో గ్యాస్ సిలెండర్ 400, ఇపుడు 1100. వంటనూనె 2014లో 70, ఇపుడు 200. పెట్రోల్ గురించి చర్చ అనవసరం
7) ఇండియా ఈజ్ గుడ్ అయితే 2016-21 మధ్య 6 లక్షల మంది పౌరసత్వం ఎందుకు వదులుకున్నారు?
8) ఇండియా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రకారం 71 శాతం మంది ఆరోగ్యకరమైన ఆహారం తినలేకపోతున్నారు
9) ప్రతిరోజూ 29 మంది రైతులు లేదా రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
10) 8 ఏళ్లలో 12 లక్షల కోట్లు బడాబాబుల బకాయిలు రద్దు చేసారు
జీఆర్ మహర్షి