త‌మిళ‌ న‌టి ట్వీట్ దుమారం

త‌మిళ‌నాడులో టాలీవుడ్ న‌టి శ్రీ‌రెడ్డిని మించిపోయే న‌టి తెరపైకి వ‌చ్చారు. అస‌లా న‌టితో పోల్చితే శ్రీ‌రెడ్డి ఏపాటి అని అన‌కుండా ఉండ‌రు. తాజాగా  సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్‌ల‌పై వివాదాస్ప‌ద న‌టి మీరా…

త‌మిళ‌నాడులో టాలీవుడ్ న‌టి శ్రీ‌రెడ్డిని మించిపోయే న‌టి తెరపైకి వ‌చ్చారు. అస‌లా న‌టితో పోల్చితే శ్రీ‌రెడ్డి ఏపాటి అని అన‌కుండా ఉండ‌రు. తాజాగా  సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్‌ల‌పై వివాదాస్ప‌ద న‌టి మీరా మిథున్ విమ‌ర్శ‌లు గుప్పిం చారు.  ఈ ట్వీట్ ప్ర‌స్తుతం కోలీవుడ్‌లో దుమారం రేపుతోంది. 2016లో మీరా మిథున్ ఫెమీనా మిస్ సౌత్‌గా కిరీటాన్ని గెలుచుకున్నారు. అయితే త‌న మాటే శ‌త్రువైన మీరా ఆ త‌ర్వాత కాలంలో ఆ కిరీటాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింది.  

త‌మిళ‌ బిగ్‌బాస్‌ రియాలిటీ  షో లో కూడా పాల్గొన్న మీరా మెయిన్‌స్ట్రీమ్ మీడియాతో పాటు సోష‌ల్ మీడియాకు కావాల్సినంత మ‌సాలా అందించారు. రియాల్టీ  గేమ్‌ షోలో దర్శకుడు చేరన్‌ తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆమె సంచ‌ల‌న‌ ఆరోపణలు చేశారు. అంతేకాదు, ప‌నిలో ప‌నిగా  ఆ షో వ్యాఖ్యాత కమలహాసన్‌ను కూడా మీరా విడిచిపెట్ట‌లేదు.  దర్శకుడు చేరన్ అస‌భ్య ప్ర‌వ‌ర్త‌నను క‌మ‌ల్‌హాజ‌న్ ఖండించ‌లేద‌ని అప్ప‌ట్లో ఆమె ర‌చ్చ చేశారు.

బిగ్‌బాస్ గేమ్ షో నుంచి బ‌య‌టికొచ్చిన త‌ర్వాత ఎక్క‌డా ఆమెకు సినీ అవ‌కాశాలు ద‌క్క‌లేదు. దీంతో త‌మిళ చిత్ర ప్ర‌ముఖుల‌ను తిట్టిపోస్తూ కాలం గ‌డుపుతున్నారామె.

కోలీవుడ్లో తన ఎదుగుదలను నటుడు రజనీకాంత్, విజయ్‌ అడ్డుకుంటున్నారంటూ మీరా తన ట్విట‌ర్ ఖాతాలో తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించారు. అంత‌టితో ఆమె ట్వీట్ ఆగ‌లేదు. మ‌రిన్ని వివాదాస్పాద కామెంట్స్‌కు వేదికైంది.  తమిళనాడు తమిళులకు, హిందువులకు చెందిందని తెలిపారు. కానీ ఇక్కడ మలయాళీలు, క్రిస్టియన్‌ ఆధిపత్యం సాగుతోందని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కండక్టర్‌ రజనీకాంత్, క్రిస్టియన్‌ విజయ్‌ తన పేరును చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఈ అమ్మ‌డు ఘాటు ట్వీట్ చేశారు.

కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి తానేనంటూ ట్విట్టర్లో ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా కన్నగి మదురైని దహించినట్టుగా తాను తమిళనాడును దహించి వేస్తానని హెచ్చ‌రించారామె. ఏ మాట‌కామాట చెప్పుకోవాలంటే టాలీవుడ్ న‌టి శ్రీ‌రెడ్డి ఒక న్యాయ‌మైన పోరాటం చేశారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై ధ్వ‌జ‌మెత్తారు. ఆమె డిమాండ్‌లో న్యాయం ఉండ‌డం వ‌ల్లే ప‌లువురు ఆమెకు మ‌ద్ద‌తుగా నిలిచారు. కానీ త‌మిళ‌న‌టి వ్య‌వ‌హారం పూర్తి భిన్న‌మైంది. త‌మ అభిమాన హీరోల‌పై అవాకులు చెవాకులు పేలిన మీరాపై ర‌జినీకాంత్‌, విజ‌య్ అభిమానులు సోష‌ల్ మీడియాలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

నా మాదిరి ఏ నిర్మాతా సంపాదించలేదు

ఏపీ స‌ర్కార్ తాజాగా హెచ్చ‌రిక