సమంతతో వ్యవహారం.. బాధగా ఉందన్న చైతూ

నాగచైతన్య-సమంత విడిపోతున్నారనే వార్త కొన్ని రోజులుగా వార్తల్లో నలుగుతూనే ఉంది. అయితే దీనిపై సమంత పరోక్షంగా స్పందించడమే తప్ప నేరుగా రియాక్ట్ అవ్వలేదు. నాగచైతన్య అయితే సమంతపై ప్రశ్నలు అడక్కూడదనే కండిషన్ పైనే ఇంటర్వ్యూలకు…

నాగచైతన్య-సమంత విడిపోతున్నారనే వార్త కొన్ని రోజులుగా వార్తల్లో నలుగుతూనే ఉంది. అయితే దీనిపై సమంత పరోక్షంగా స్పందించడమే తప్ప నేరుగా రియాక్ట్ అవ్వలేదు. నాగచైతన్య అయితే సమంతపై ప్రశ్నలు అడక్కూడదనే కండిషన్ పైనే ఇంటర్వ్యూలకు కూర్చుంటున్నాడు. అయినప్పటికీ సమంత వ్యవహారంపై స్పందించక తప్పలేదు. తామిద్దరం విడిపోయామనే వార్త జనాల మనసుల్లో ఎక్కువ రోజులు ఉండదని అంటున్నాడు నాగచైతన్య.

“ఇది జనాల మనసుల్లో ఎక్కువ రోజులు ఉండదు. ఏదైతే అసలైన వార్త అవుతుందో, కేవలం అది మాత్రమే జనాల మైండ్స్ లో ఉంటుంది. ఇలాంటి మిడిమిడి వార్తలు నిలబడవు. కేవలం టీఆర్పీల కోసం సృష్టించిన ఇలాంటి పైపై వార్తల్ని కొన్నాళ్లకు అంతా మరిచిపోతారు.”

సమంత, తను విడిపోయామనే వార్తలపై నాగచైతన్య ఇలా నర్మగర్బంగా స్పందించాడు. మీడియా కేవలం టీఆర్పీ కోసమే ఇలా వ్యవహరిస్తోందని, ఇదంతా తాత్కాలికం అని ఎప్పుడైతే తనకు అర్థమైందో.. అప్పట్నుంచి బాధపడడం మానేశానని అంటున్నాడు నాగచైతన్య. అయితే వ్యక్తిగతంగా మాత్రం కొంచెం బాధ ఉంటుందంటున్నాడు.

“అవును నిజమే.. వ్యక్తిగతంగా ఇది కొంచెం బాధ కలిగించే విషయమే. అసలు వినోదం అనేది ఈ దిశగా ఎందుకు వెళ్తోందా  అని అనిపించేది. అయితే ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఈ రోజుల్లో న్యూస్ అంటే ఇదే. ఇదే న్యూస్.”

వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని కలపడం తనకు ఇష్టం ఉండదంటున్నాడు చైతూ. తన తండ్రి నుంచి ఈ విషయాన్ని నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు.

“వ్యక్తిగత విషయాల్ని, ప్రొఫెషనల్ లైఫ్ ను సెపరేట్ చేసి చూడడం నా కెరీర్ ఆరంభంలోనే మొదలుపెట్టాను. నిజానికి ఇది మా తండ్రిని చూసి నేర్చుకున్నాను. నాన్న ఇంటికొచ్చిన తర్వాత వర్క్ గురించి మాట్లాడరు. సెట్స్ పైకి వెళ్లిన తర్వాత వ్యక్తిగత విషయాలు ఆలోచించరు. ఇదే నాకు కూడా అలవాటైంది.”

సమంతతో విడిపోయిన అంశంపై సూటిగా స్పందించనప్పటికీ.. తామిద్దరి మధ్య గ్యాప్ ఉన్న విషయాన్ని నాగచైతన్య ఇలా పరోక్షంగా బయటపెట్టాడు. ఎప్పుడైతే తన సోషల్ మీడియా ఎకౌంట్ నుంచి ''అక్కినేని'' అనే పదాన్ని సమంత తొలిగించిందో, అప్పట్నుంచి ఈ పుకార్లు ఊపందుకున్నాయి. ప్రస్తుతం సమంత చెన్నైలో ఉంటోంది.