మహాసముద్రం..మామూలుగా లేదు

ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓ డిఫరెంట్ సినిమాను అందించి అందరి చూపులు తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. అప్పటి నుంచి మహాసముద్రం అనే కథను పట్టుకుని, అదే సినిమా తీస్తా అని కూర్చున్నాడు. …

ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓ డిఫరెంట్ సినిమాను అందించి అందరి చూపులు తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. అప్పటి నుంచి మహాసముద్రం అనే కథను పట్టుకుని, అదే సినిమా తీస్తా అని కూర్చున్నాడు. 

కాలం వృధా చేస్తున్నాడనుకున్నారంతా. కానీ ట్రయిలర్ చూసిన తరువాత అర్థం అయింది, ఓ లోతైన కథను తయారు చేసుకుని, దాన్నే నమ్ముకుని వుండిపోయాడని. 

వచ్చే నెల రెండో వారంలో విడుదలవుతోంది మహాసముద్రం సినిమా. దాని ట్రయిలర్ ఈ రోజు విడుదలయింది. దాదాపు సినిమా చూపించినంత పని చేసాడు అజయ్ భూపతి. శర్వానంద్, సిద్దార్ద, రావు రమేష్, జగపతి బాబు, అదితిరావు హైదరి ఇలా అన్ని పాతలను భయంకరమైన డెప్త్ తో తయారుచేసినట్లు క్లియర్ గా తెలిసిపోతోంది.

మానవ సంబంధాలు, భావోద్వేగాలు ట్రయిలర్ లో మామూలుగా పండించలేదు. అవుట్ అండ్ అవుట్ ఎమోషనల్ సినిమా అందించినట్లు అర్థం అయపోతోంది. 

డైలాగులు కూడా బలంగానే పడ్డాయి. 'ఇక్కడ మనకు నచ్చినట్లు బతకాలంటే మన జాతకాలను దేవుడు మందు కొట్టి రాసుండాలి' …'నవ్వుతూ వున్నంత మాత్రాన ఆనందంగా వున్నట్లు కాదు..'…ట్రయిలర్ లో తీసిన పడవబోల్తా పడే ఫస్ట్ షాట్ ఫ్రేమ్ భలే వుంది. 

టోటల్ గా మహాసముద్రం మీద ఓ అంచనాలు ఏర్పడేలా చేసింది ట్రయిలర్. ఈ సినిమాకు నిర్మాత అనిల్ సుంకర.