Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్రాణం ఖరీదు నుంచి ఆచార్య వరకు...!

ప్రాణం ఖరీదు నుంచి ఆచార్య వరకు...!

ఏడాది.. రెండేళ్లు.. దశాబ్దం.. రెండు దశాబ్దాలు కాదు.. ఏకంగా 43 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. తెలుగు సినీ చరిత్రలో మరో మైలురాయిని అధిగమించారు చిరంజీవి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి విజయవంతంగా 43 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. అంటే నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్ అన్నమాట.

43 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చిరంజీవి స్పందించారు. అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. ఆగస్ట్ 22న తను ఓ మనిషిగా జన్మిస్తే.. సెప్టెంబర్ 22న ఓ నటుడిగా జన్మించానని, నటుడిగా తనకు జన్మనిచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు చిరంజీవి.

తండ్రి 43 ఏళ్ల కెరీర్ పూర్తిచేసుకున్న సందర్భంగా తనయుడు రామ్ చరణ్ కూడా రియాక్ట్ అయ్యాడు. తండ్రికి శుభాకాంక్షలు చెబుతూనే.. అప్పటి ప్రాణంఖరీదు స్టిల్ ను, ఇప్పటి ఆచార్య స్టిల్ ను పక్కపక్కన పెట్టి పోస్ట్ చేశాడు. ఈ రెండు ఫొటోల మధ్య 43 ఏళ్ల సినీ చరిత్రనే సృష్టించారు చిరంజీవి.

ప్రస్తుతం ఈ మెగా తండ్రికొడుకులిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. అదే ఆచార్య. గతంలో మగధీర, బ్రూస్ లీ లాంటి సినిమాల్లో చిరు-చరణ్ కలిసి నటించినప్పటికీ.. ఆచార్య సినిమా చాలా ప్రత్యేకం. ఇందులో రామ్ చరణ్ ది దాదాపు 20 నిమిషాల నిడివి ఉన్న ప్రత్యేకమైన కీలక పాత్ర. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?