‘హిట్’ సినిమాకు ఫిట్ హీరో

తెలుగులో రీసెంట్ టైమ్స్ లో క్లిక్ అయిన సినిమా “హిట్”. ఇప్పుడీ సినిమా బాలీవుడ్ బాట పట్టింది. తెలుగులో నాని నిర్మించిన ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను దిల్ రాజు దక్కించుకున్న…

తెలుగులో రీసెంట్ టైమ్స్ లో క్లిక్ అయిన సినిమా “హిట్”. ఇప్పుడీ సినిమా బాలీవుడ్ బాట పట్టింది. తెలుగులో నాని నిర్మించిన ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను దిల్ రాజు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ప్రాజెక్టును అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు రాజు.

హిందీలో రాజ్ కుమార్ రావు హీరోగా హిట్ సినిమా రీమేక్ కాబోతోంది. సెప్టెంబర్ రెండో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. తెలుగులో ఈ సినిమాను డైరక్ట్ చేసిన శైలేష్ కొలను, హిందీ రీమేక్ ను కూడా హ్యాండిల్ చేయబోతున్నాడు.

బాలీవుడ్ స్టయిల్, నేటివిటీకి తగ్గట్టు “హిట్”లో కొన్ని మార్పుచేర్పులు ఉంటాయని ప్రకటించిన శైలేష్.. యూనివర్సల్ పాయింట్ తో తెరకెక్కిన తన సినిమా హిందీలో కూడా కచ్చితంగా హిట్ అవుతుందంటున్నాడు. తెలుగులో హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ కు పెద్దగా చోటివ్వని దర్శకుడు.. హిందీలో మాత్రం ఆ యాంగిల్ లో కాస్త ఎక్కువ సీన్స్ చూపించే అవకాశం ఉంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన ఈ సినిమా ఫస్ట్ టైమ్ నానికి నిర్మాతగా లాభాలు తెచ్చిపెట్టింది. హిందీలో ఈ రీమేక్ ను మరో నిర్మాత కుల్ దీప్ రాథోర్ తో కలిసి నిర్మించబోతున్నాడు దిల్ రాజు.

ఏపీ స‌ర్కార్ తాజాగా హెచ్చ‌రిక

నా మాదిరి ఏ నిర్మాతా సంపాదించలేదు