సిద్దు…’నరుడి బతుకు నటన’

నరుడి బతుకు నటన..ఈశ్వరుడి తలపు ఘటన అన్న పాట ఎంత అద్భుతమైన హిట్ అన్నది తెలిసిన సంగతే. ఇప్పుడు అదే పాట మకుటంతో సినిమా రాబోతోంది. 'కృష్ణ అండ్ హిజ్ లీల' అనే సినిమాతో…

నరుడి బతుకు నటన..ఈశ్వరుడి తలపు ఘటన అన్న పాట ఎంత అద్భుతమైన హిట్ అన్నది తెలిసిన సంగతే. ఇప్పుడు అదే పాట మకుటంతో సినిమా రాబోతోంది. 'కృష్ణ అండ్ హిజ్ లీల' అనే సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన హీరో సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమా చేయబోతున్నారు. 

ఈ సినిమా కోసం నరుడి బతుకు నటన అనే టైటిల్ ను అనుకుంటున్నారు. హీరో సిద్దూనే ఒక కొత్త దర్శకుడితో కలిసి ఈ కథను తయారుచేసుకున్నాడు. కృష్ణలీల తరువాత తనతో సినిమా చేయాలనుకున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ నాగవంశీకి ఈ కథ చెప్పడం, ఆయన వెంటనే ఓకె చేయడం, ప్రాజెక్టు ఫిక్స్ అయిపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

లాక్ డౌన్ ఎప్పుడు అయిపోతే అప్పుడు వరుసపెట్టి సినిమాలు సెట్ మీదకు తీసుకెళ్లేందుకు భారీ ప్లాన్ లు వేస్తోంది సితార సంస్థ. కప్పెల, అయ్యప్పన్ కోషియమ్ రీమేక్, సిద్దు 'నరుడి బతుకు నటన', రవికాంత్ పేరపు డైరక్షన్ లో ఒక సినిమా ప్లానింగ్ లో వున్నాయి.

ఏపీ స‌ర్కార్ తాజాగా హెచ్చ‌రిక

నా మాదిరి ఏ నిర్మాతా సంపాదించలేదు