సస్పెన్స్ కి తెరపడింది.. చేయూత అందరికీ

ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని వాటిని కూడా అమలు చేసే గొప్ప మనసున్న నాయకుడని పదే పదే రుజువు చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్. టీడీపీ హయాంలో ఏదైనా పథకం ప్రారంభిస్తే.. సవాలక్ష కండిషన్లు పెట్టేవాళ్లు.…

ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని వాటిని కూడా అమలు చేసే గొప్ప మనసున్న నాయకుడని పదే పదే రుజువు చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్. టీడీపీ హయాంలో ఏదైనా పథకం ప్రారంభిస్తే.. సవాలక్ష కండిషన్లు పెట్టేవాళ్లు. చివరకు లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోతవేసేవారు. బాబు హయాంలో ప్రవేశపెట్టిన నిరుద్యోగ భృతి దీనికి నిలువెత్తు ఉదాహరణ. కానీ జగన్ అలా కాదు. ఎంతమంది అర్హులైతే అంతమందికీ సంక్షేమ ఫలాలు అందాలని తాపత్రయపడే వ్యక్తి జగన్.

అమ్మఒడి పథకాన్ని ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకి కూడా వర్తింపజేశారు. రైతు భరోసా కౌలు రైతులకి కూడా ఇచ్చారు. తాజాగా చేయూత పథకాన్ని పింఛన్ దారులకి కూడా వర్తింపచేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. వైఎస్సార్ చేయూత పథకాన్ని జగన్ ప్రకటించిన వెంటనే ప్రతిపక్షాలతో సహా.. ప్రజలు కూడా పెదవి విరిచారు.

ఎందుకంటే.. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి 18,700 రూపాయలు ఆర్థిక సాయం అందించే పథకం అది. అయితే అప్పటికే వితంతు, వికలాంగ, ఒంటరి మహిళ, చేనేత, గీత కార్మిక పింఛన్లు అందుకునేవారు దీనికి అనర్హులంటూ అధికారులు జీవో విడుదల చేశారు. దీంతో చాలామంది అనర్హులుగా మారారు. ఏ పింఛను లభించని ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు, అందులోనూ.. 45నుంచి 60ఏళ్ల లోపువారు అంటే అతి తక్కువమంది లబ్ధిదారులుంటారని, వైఎస్సార్ చేయూత పేరుకే పథకం కానీ ఎవరికీ ఉపయోగపడదని విమర్శలొచ్చాయి. అది నిజం కూడా.

కానీ ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేశారు సీఎం జగన్. సామాజిక పింఛన్లు అందుకుంటున్న వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు.. ఇతర కేటగిరీ మహిళలు కూడా ఈ పథకానికి అర్హులంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పటికే పింఛను తీసుకుంటున్న 8.21 లక్షల మంది మహిళలకు అదనంగా లబ్ధి చేకూరుతుందన్నమాట.

వీరు కాకుండా ఇప్పటి వరకూ వైఎస్సార్ చేయూత కోసం 17.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే మొత్తంగా 25.24 లక్షల మంది మహిళలకు ఈ పథకం ఉపయోగపడుతుంది. నాలుగేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఒక్కొకరికి సుమారు 75వేల ఆర్థిక సాయం అందుతుంది. ఏడాదికి రూ.1540.89 కోట్ల రూపాయల చొప్పున నాలుగేళ్లలో ఈ పథకం కోసం రూ.6163.59 కోట్లు ఖర్చు చేయబోతున్నారు.

ఇక కేబినెట్ తీసుకున్న మరో కీలక నిర్ణయం జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు కమిటీ ఏర్పాటు చేయడం. చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటవుతుంది, రాష్ట్రంలోని జిల్లాలను 13నుంచి 25కి పెంచడంపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. వీలైనంత త్వరగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉండాలని మంత్రివర్గం పేర్కొనడంతో.. దాదాపుగా ఏపీలో జిల్లాల సంఖ్య పెరుగుతుందనే విషయం స్పష్టమైంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగానే జిల్లాలను పునర్ వ్యవస్థీకరించబోతున్నారు. 

ఏపీ స‌ర్కార్ తాజాగా హెచ్చ‌రిక