అయ్యన్నకు ఉన్న ధైర్యం బాబుకు లేదా…?

తెలుగుదేశం పార్టీ పుట్టాక మొదట చేరింది తానే అని ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎపుడూ చెబుతూ ఉంటారు. ఒక విధంగా తాను చంద్రబాబు కంటే సీనియర్ ని అని ఆయన…

తెలుగుదేశం పార్టీ పుట్టాక మొదట చేరింది తానే అని ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎపుడూ చెబుతూ ఉంటారు. ఒక విధంగా తాను చంద్రబాబు కంటే సీనియర్ ని అని ఆయన ఆర్భాటిస్తారు. టీడీపీ గెలిస్తే ఎన్నో సార్లు మంత్రి కూడా అయిన అయ్యన్నపాత్రుడు తన సీనియారిటీని చూసుకుని అధినాయకత్వానికి చాలా సార్లు సలహాలు ఇస్తూంటారు.

తాజాగా ఆయన అలాంటి ఒక మహత్తరమైన సలహా చంద్రబాబుకే ఇచ్చేశారు. బల్ల గుద్ది మరీ చెబుతున్నా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుస్తుంది ఓటేసేందుకు మనకు జనాలు సిద్ధంగా ఉన్నారని మాట్లాడిన అయ్యన్న తొందరగా టికెట్లు గెలిచే క్యాండిడేట్లకు ఇచ్చేయమని డైరెక్ట్ గా బాబుకే సూచించారు.

గెలవను అనుకుంటే తనకు కూడా టికెట్ ఇవ్వవద్దని చెప్పడం ద్వారా తన పాయింట్ ఎంత స్ట్రాంగ్ అన్నది అధినేతకే తెలియచేశారన్న మాట. చంద్రబాబుకు ఎపుడూ చివరి నిముషంలో టికెట్లు ఇవ్వడం అలవాటు. ఆ టైం లో పక్క పార్టీల నుంచి ఇంకా బలమైన వారు వస్తే వారి కోసం టికెట్లు అట్టేబెట్టడమూ ఒక స్ట్రాటజీ. అయితే ఇపుడు అలాంటివి వద్దు అంటున్నారు అయ్యన్న.

జనాలు మనలను గెలిపిస్తారు బాబుగారూ అంటూ కొత్త ధైర్యం అయ్యన్న బాగా నూరిపోశారు. అయ్యన్న ఏ సర్వే చేసి ఫలితాలు రాబట్టారో లేక ఏ జోస్యం తెచ్చి చెబుతున్నారో కానీ తమ్ముళ్ళకు కమ్మనైన మాటనే చెప్పారు. టీడీపీ గెలుస్తుంది అని.

అయితే అదే ధైర్యం బాబుకు లేదా అన్న డౌట్లు సొంత పార్టీలోనే వస్తున్నాయి. లేకపోతే లాస్ట్ చాన్స్, నాతోనే మీరు ఉండండి, ఏపీ కోసం గెలిపించండి అంటూ బాబు జనాల ముందు  ఎమోషనల్ డైలాగులు ఎందుకు కొడతారు అని కూడా వారే తర్కించుకుంటున్నారు.

మరో మాటగా చెప్పుకోవాలంటే ఓడితే అయ్యన్నకు ఏమవుతుంది, మాజీ మంత్రిగా ఉంటారంటే. పెద్దగా పోయిందేమీ లేదు. టీడీపీకి సర్వసత్తాక అధికారి అయిన చంద్రబాబుకి ఆయన టోటల్ రాజకీయానికి అసలైన దెబ్బ. కాబట్టి సలహాలు ఇలాంటివి సీనియర్ తమ్ముళ్ళు ఎన్ని అయినా ఇస్తారు బాబు లాంటి వారు అన్నీ చూసుకోవద్దూ అని అంటున్న వారూ ఉన్నారు.