ఐటీ రాజధాని దిశగా మరో ముందడుగు

ఐటీకి రూట్లు విశాఖలో వేగంగా పడుతున్నాయి. విశాఖలో ఇప్పటికే ప్రఖ్యాతి చెందిన ఐటీ కంపెనీలు వరసగా వచ్చి చేరాయి. తొందరలో మరిన్ని రానున్నాయి. విశాఖ ఐటీ హిల్స్ మీద చాలా స్టార్టప్ కంపెనీలు కూడా…

ఐటీకి రూట్లు విశాఖలో వేగంగా పడుతున్నాయి. విశాఖలో ఇప్పటికే ప్రఖ్యాతి చెందిన ఐటీ కంపెనీలు వరసగా వచ్చి చేరాయి. తొందరలో మరిన్ని రానున్నాయి. విశాఖ ఐటీ హిల్స్ మీద చాలా స్టార్టప్ కంపెనీలు కూడా ఉన్నాయి. మరిన్ని కొత్తవి రాబోతున్నాయి.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు విశాఖను ఐటీ పరంగా మరింతగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ తరువాత ఐటీ సంస్థలు కూడా విశాఖను బెస్ట్ అప్షన్ గా చూస్తున్నాయి. టైర్ టూ సిటీస్ లో ఐటీ డెవలప్మెంట్ చేయాలంటే విశాఖనే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది.

దాంతో విశాఖను ఐటీపరంగా మరింతగా ప్రమోట్ చేసేందుకు హిస్టరీలో ఫస్ట్ టైం  అన్నట్లుగా అతి పెద్ద ఐటీ సదస్సుని విశాఖలో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు కొత్త ఏడాది జనవరి 20, 21 తేదీలలో జరగనుంది. ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, ఏపీఐఎస్ సంయుక్త ఆధ్వర్యంలో తమ అసోసియేషన్ ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

ఈ రెండు రోజుల సదస్సుకు జాతీయ అంతర్జాతీయ సథాయిలో పేరున్న పలు ఐటీ సంస్థలకు చెందిన అధినేతలు పాల్గొంటారు. విశాఖలో ఐటి రంగం పురోగతికి సంబంధించి విలువైన సూచనలు ఈ సదస్సు అందిస్తుంది అని గట్టిగా నమ్ముతున్నారు. అదే విధంగా ఈ సదస్సులో పెద్దఎత్తున స్టార్ట్అప్ కంపెనీలు కూడా పాల్గొంటున్నాయి. నూతన సంవత్సరంలో విశాఖ ఐటీ రాజధాని దిశగా వేసే మరో ముందడుగు ఈ సదస్సు అని చెబుతున్నారు.