నాని కెరీర్ లో భారీ సినిమా

రాను రాను హీరోల రెమ్యూనిరేషన్ లు పెరుగుతున్నాయి. దానికి తగినట్లు నిర్మాణ వ్యయాలు పెరుగుతున్నాయి. పైగా మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కొత్త కొత్త కథలు ఆలోచిస్తున్నారు. దాంతో భారీ వ్యయం కూడా అవసరం…

రాను రాను హీరోల రెమ్యూనిరేషన్ లు పెరుగుతున్నాయి. దానికి తగినట్లు నిర్మాణ వ్యయాలు పెరుగుతున్నాయి. పైగా మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కొత్త కొత్త కథలు ఆలోచిస్తున్నారు. దాంతో భారీ వ్యయం కూడా అవసరం పడుతోంది. 

హీరో నాని చేస్తున్న సినిమా దసరా. సింగరేణి బ్యాక్ డ్రాప్ లో రంగస్థలం టైపు కథ. పల్లెటూరు, అగ్రవర్ణాలు, బడుగు వర్గాలు అంటూ విభజనరేఖలు..వివాదాలు వంటి అచ్చమైన నేటివ్ కథ.

ఈ సినిమా కోసం రంగస్థలం మాదిరిగా ఓ ఊరు సెట్ నే వేసారు. దానికే దాదాపు మూడు, నాలుగు కోట్లు ఖర్చుచేసారు. ఇవన్నీ కలిపి దసరా సినిమాను ఇప్పుడు భారీ సినిమాగా మార్చేసాయి. 

కొత్త దర్ళకుడు అయినా సుకుమార్ స్కూల్ నుంచి రావడంతో, కాస్త ఖర్చు ఎక్కువే అవుతోందని తెలుస్తోంది. మొత్తం 60 కోట్ల మేరకు దసరా సినిమా బడ్జెట్ వుంటుందని తెలుస్తోంది.

అంటే నాని కెరీర్ లోనే అత్యంత భారీ సినిమా అన్నమాట. గతంలో దిల్ రాజు నిర్మించిన వి సినిమాకు నలభై కోట్ల వరకు అయింది. అలాగే గ్యాంగ్ లీడర్ కూడా కూడా అదే రేంజ్ లో ఖర్చయింది. 

కానీ ఏకంగా 60 కోట్ల సినిమా అన్నది ఇదే తొలిసారి. కిట్టుబాటు అవుతుందా? కాదా? అన్నది విడుదల వేళకు కానీ తెలియదు. కానీ ఈ కథను నాని గట్టిగా నమ్ముతున్నారు.