నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత, ఆ బంధానికి సంబంధించిన గుర్తులన్నీ చెరిపేసింది సమంత. తన సోషల్ మీడియా పేజీల నుంచి నాగచైతన్యతో దిగిన ఫొటోల్ని డిలీట్ చేసింది. మరీ ముఖ్యంగా పెళ్లి, ఫ్యామిలీ ఫంక్షన్ల ఫొటోలన్నీ తొలిగించింది. మరోవైపు అక్కినేని కుటుంబ సభ్యుల నుంచి తన పెళ్లికి వచ్చిన కానుకల్ని కూడా ఆమె తిరిగిచ్చేసిందంటూ కథనాలు వచ్చాయి. కలిసి నివశించిన ఫ్లాట్ ను కూడా వదిలేసుకున్నట్టు వార్తలొచ్చాయి.
ఇలా అన్ని రకాలుగా చైతూ నుంచి సంబంధాలు తెంచుకున్న సమంత, ఒక్కటి మాత్రం ఇంకా కొనసాగిస్తోంది. అదే పచ్చబొట్టు. అవును.. సమంత ఒంటిపై 'చై' అనే పేరు ఇంకా అలానే ఉంది. తాజాగా నిర్వహించిన ఫొటో షూట్ లో అది బయటపడింది.
ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ తో సమంతకు డీల్ కుదిరింది. డీల్ లో భాగంగా హాట్ ఫొటోషూట్ చేశారు. తాజాగా ఆ స్టిల్స్ కూడా బయటకొచ్చాయి. అందులో సమంత పక్కటెముకపై ఉన్న చై అనే టాటూ బయటపడింది.
ఈ టాటూను చాన్నాళ్ల పాటు ఎవ్వరికీ చూపించలేదు సమంత. ఓ బేబీ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఆ ఆనందంలో ఈ టాటూ వివరాల్ని బయటపెట్టింది. “ఇన్నాళ్లు ఎవరికీ కనిపించకుండా దాచిన టాటూను ఫైనల్గా చూపించేస్తున్నాను. నా భర్త చై నా ప్రపంచం” అంటూ అప్పట్లో ఈ స్టిల్ రిలీజ్ చేసింది సమంత. ఇంగ్లిష్ లో చై అని రాసిన టాటూ ఇది.
నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఈ పచ్చబొట్టును సమంత చెరిపేసుకుందని అంతా అనుకున్నారు. సర్జరీ చేయించుకొని మరీ ఈ టాటూను తీయించుకుందంటూ ఆ మధ్య స్టోరీలు వచ్చాయి. కట్ చేస్తే, ఇంకా చై అనే పదం సమంత ఒంటిపై అలానే ఉంది. పుష్ప ఐటెంసాంగ్ లో ఈ పచ్చబొట్టు స్పష్టంగా కనిపించింది.
తాజా ఫొటోషూట్ లో మరోసారి ఎలివేట్ అయింది. నాగచైతన్యతో అన్ని విధాలుగా తెగతెంపులు చేసుకున్న సమంత, ఈ ఒక్క పచ్చబొట్టును మాత్రం ఎందుకు ఇంకా కొనసాగిస్తోందనేది ప్రస్తుతానికి సస్పెన్స్.