క్యూట్ గా మీట్ క్యూట్

వెబ్ సిరీస్ లు, ఓటీటీ డైరెక్ట్ వ్యవహారాలు అంటే మాఫియా, సెక్స్, ఎఫ్ వర్డ్ లు, ఇలా నానా బీభత్సం, ఫ్యామిలీలకు దూరం అనేట్లు చేసేసారు. దాంతో ఏ ఓటీటీ లో మన తెలుగు…

వెబ్ సిరీస్ లు, ఓటీటీ డైరెక్ట్ వ్యవహారాలు అంటే మాఫియా, సెక్స్, ఎఫ్ వర్డ్ లు, ఇలా నానా బీభత్సం, ఫ్యామిలీలకు దూరం అనేట్లు చేసేసారు. దాంతో ఏ ఓటీటీ లో మన తెలుగు వాళ్లు వెబ్ సిరీస్ చేసినా, వెబ్ ఫిలిం లు చేసినా జ‌నం పక్కన పెట్టేసారు. 

ఇలాంటి టైమ్ లో ఓ క్లీన్ అండ్ ఎమోషనల్ వెబ్ కంటెంట్ కనిపిస్తే కాస్త ఆనందం, మరి కాస్త ఆశ్చర్యం అనిపిస్తుంది. హీరో నాని నిర్మించిన, నాని సోదరి దీప్తి గంటా దీప్తి దర్శకత్వం వహించిన మీట్ క్యూట్ వెబ్ సిరీస్ ట్రయిలర్ చూస్తే ఇలాగే అనిపించింది.

వివిధ జీవితాల సమాహారం అన్న ప్రూవ్డ్ జానర్ లోనే తయారైన ఈ వెబ్ సిరీస్ లో ఆధునిక యువత ఆలోచనాధోరణికి అద్దం పట్టే కథలను చేర్చినట్లు కనిపిస్తోంది. ఆధునిక యువత జీవితాల్లోని అయోమయం, సంఘర్షణ, అనుమానాలు అన్నీ ఇందులో చోటు చేసుకున్నాయి. అసలు మీట్ క్యూట్ అనే పదానికి అర్థం ఏమిటనేది నాని వాయిస్ ఓవర్లో చెబుతూ ట్రయిలర్ కంటెంట్ ప్రారంభమైంది.

మెయిన్ స్ట్రీమ్ సినిమాకు ఎంత మాత్రం తీసిపోకుండా వుంది కంటెంట్ అండ్ క్వాలిటీ ని సెట్ చేసారు. సత్యరాజ్, రోహిణి, ఆదాశర్మ, వర్ష బొల్లమ్మ, సునయన, శివ కందుకూరి ఇంకా చాలా మంచి స్టార్ కాస్ట్ నే కనిపించింది ట్రయిలర్ లో. అందరి నుంచి మంచి వర్క్ నే రాబట్టుకున్నట్లు అర్థమయింది.

సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం బాగున్నాయి. వాల్ పోస్టర్ సంస్థ నిర్మించిందీ వెబ్ సిరీస్ ను.