ఆ మధ్య టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సమయంలో నారా లోకేష్ ఎంత రాద్ధాంతం చేశారో అందరికీ తెలుసు. తను విద్యార్థుల మేనమామనని, పరీక్షలు వద్దని, అందర్నీ పాస్ చేయించాలని పట్టుబట్టారు. దీంతో పరీక్షలపై విద్యార్థుల్లోనూ, తల్లిదండ్రుల్లోనూ కాస్త నిర్లక్ష్యం వచ్చేసింది.
చివర్లో ప్రభుత్వం కూడా పరీక్షలు రద్దు చేస్తుందిలే అనే ఉద్దేశంతో లైట్ తీసుకున్నారు. చివరకు ఫలిలాలు ఇలా తేడా కొట్టాయి. దీంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ ల్ ట్రోలింగ్ మొదలైంది. పప్పు వల్లే ఇలాంటి తప్పు జరిగిందని సెటైర్లు పడుతున్నాయి.
తప్పంతా లోకేష్ దే…
నారా లోకేష్ ఫారిన్ లో చదివారనే మాటే కానీ, ఆయనకు లోకజ్ఞానం, విషయ పరిజ్ఞానం తక్కువనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆయన్ను పప్పు పప్పు అనడం పరిపాటి. అలాంటి లోకేష్ వల్లే.. ఇప్పుడు తమ పిల్లలు కూడా అలాగే తయారయ్యారనే ఆవేదన తల్లిదండ్రుల్లో ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.
లోకేష్ డిమాండ్ల వల్లే, అప్పట్లో లోకేష్ వేసిన సెటైర్ల వల్లే, అసలు పరీక్షలు ఎందుకు అంటూ ఆయన చేసిన కామెంట్ల వల్లే పిల్లలు చదవలేదని, అందుకే ఫెయిలయ్యారని ట్రోలింగ్ జరుగుతోంది.
రివర్స్ అవుతున్న విమర్శలు..
టెన్త్ క్లాస్ రిజల్ట్ సరిగా రాకపోవడానికి కారణం ప్రభుత్వేనంటూ ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. కానీ సరైన కారణం మాత్రం చెప్పలేకపోతున్నాయి. పేపర్ల లీకేజీపై వార్తలు రావడంతో మరింత పగడ్బందీగా పరీక్షలు జరపాలనుకోవడం తప్పా..? రెండేళ్లుగా మెరిట్ స్టూడెంట్స్.. 'ఆల్ పాస్' నిర్ణయంతో ఇబ్బంది పడుతున్నారని, ఈ ఏడాది పరీక్షలు పెట్టడం తప్పా..? ఇందులో ఏది తప్పో ప్రతిపక్షాలే చెప్పాలి.
కారణం చెప్పకుండా గుడ్డిగా విమర్శలు మాత్రం మొదలుపెట్టారు ప్రతిపక్ష నేతలు. కానీ ఉపాధ్యాయ వర్గం, మేథావి వర్గం నుంచి మాత్రం ఎలాంటి వ్యతిరేకత లేకపోవడం విశేషం. కరోనా వల్ల పిల్లలు చదవలేకపోయారని అందుకే రిజల్ట్ తక్కువగా వచ్చాయని అంటున్నారు. అదే సమయంలో టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ రాసినవారికి కంపార్ట్ మెంటల్ పాస్ లేదని, వారు కూడా రెగ్యులర్ పాస్ అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కూడా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
మొత్తమ్మీద.. టెన్త్ రిజల్ట్ విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయాలనుకుంటే.. అది పూర్తిగా రివర్స్ అయి కూర్చుంది. ఈ విషయంలో ప్రజల దృష్టిలో లోకేష్ మరింత పలుచనయ్యారు.