మనిషికి గుండె ఆయువు పట్టు. అలాగే రాజకీయ నేతలకు వారి కుటుంబాలకు కూడా ప్రాణ సమానమైనవి కొన్ని ప్యాకెట్స్ ఉంటాయి.
కింజరాపు ఫ్యామిలీకి నాలుగు దశాబ్దాలుగా పెట్టని కోటగా, కంచు కోటగా ఉన్న ప్రాంతం సంతబొమ్మాళి మండలం. ఈ మండలంలో తెలుగుదేశం జెండా తప్ప మరోటి ఎగిరిన దాఖలాలు ఎపుడూ లేవు.
రాష్ట్రంలో ఎన్ని పార్టీలు వచ్చినా ప్రభుత్వాలు మారినా సంతబొమ్మాళి అంటే కింజరాపు ఫ్యామిలీదే. వారు టీడీపీలో ఉన్నారు కాబట్టి ఆ జెండా రెపరెపలాడాల్సిందే. అలాంటి చోట ఇపుడు వైసీపీ జెండా ఎగురుతోంది.
సంతబొమ్మాళీ జెడ్పీటీసీగా పాల వసంతరెడ్డి గెలిచారు. ఆయన టీడీపీ అభ్యర్ధి మీద ఏకంగా 13వేల 600 ఓట్ల మెజారిటీతో ఘన విజనం సాధించడం విశేషం.
కాంగ్రెస్ సహా ఎన్ని పార్టీలు పోటీ చేసినా కూడా ఇక్కడ తెలుగుదేశమే ఎపుడూ గెలుస్తూ వచ్చేది. అంత వరకూ ఎందుకు 2019 ఎన్నికల్లో టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అచ్చెన్నాయుడు గెలుపునకు పూర్తిగా నూటికి నూరు శాతం సహకరించిన మండలం కూడా ఇదే.
దాంతో గుండెకాయ లాంటి సంతబొమ్మాళి తొలిసారి ఓటమి రుచి చూపించడంతో అది అచ్చెన్న వర్గంతో పాటు టీడీపీ వారికి కూడా తట్టుకోలేని బాధగా ఉందని అంటున్నారు.