రాశిఫలాలు…12.07.20 నుంచి 18.07.20 వరకు

మేషం: ఈవారం ఆశ్చర్యకరమైన పనులు పూర్తి కాగలవు. ప్రస్తుత పరిస్థి తులు సైతం చక్కబడి ఊరట చెందుతారు. ఒక సమస్య అనుకూలంగా పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంతకాలం పడిన కష్టం ఫలించే సమయం. విచిత్రమైన…

మేషం: ఈవారం ఆశ్చర్యకరమైన పనులు పూర్తి కాగలవు. ప్రస్తుత పరిస్థి తులు సైతం చక్కబడి ఊరట చెందుతారు. ఒక సమస్య అనుకూలంగా పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంతకాలం పడిన కష్టం ఫలించే సమయం. విచిత్రమైన సంఘటనలు ఎదురవు తాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికం…ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబం…భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యాల ప్రస్తావనతో హడావిగా గడుపుతారు. ఆరోగ్యం…ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. నిరుద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.  వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు సమకూరతాయి.  ఉద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలకు అంచనాలు నిజమవుతాయి. మహిళలకు కొత్త ఆశలు. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 

వృషభం: ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల సాయం అందుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ప్రతిభాపాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. దేవాలయాలు సందర్శిస్తారు. ఆర్థికం…ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతుంది. రుణబాధలు తొలగుతాయి. ఇతరుల నుంచి కొంత సొమ్ము అందుతుంది. కుటుంబం…అందరితోనూ సఖ్యత నెలకొని ఊరట చెందుతారు. మీపై మరింత ఆదరణ చూపుతారు. ఆరోగ్యం….మరింత మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగులు కోరుకున్న మార్పులు పొందుతారు. రాజకీయ, పారిశ్రామికరంగాల వారికి కలిసివచ్చేకాలం. మహిళలకు సంతోషకర సమాచారం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతను పూజించండి. 

మిథునం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల తోడా’టుతో ముందడుగు వేస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. జీవితాశయం నెరవేరుతుంది. దీక్షాపరులై ఆశించిన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. భూవివాదాల నుంచి బయటపడతారు. ఆర్థికం.. ఇబ్బందులు తొలగుతాయి. అవసరాలకు తగినంత సొమ్ము సమకూరుతుంది. కుటుంబం…భార్యాభర్తల మధ్య స్వల’ వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. పెదద్ల సలహాలు పాటిస్తూ ముందుకు సాగుతారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి, లాభాలు అందుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. విధుల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి అరుదైన అవకాశాలు. మహిళలకు సమస్యలు కొన్ని తీరతాయి. ఉత్తరదిశప్రయాణాలు అనుకూలం. శ్రీ అన్నపూర్ణాష్టకం పఠించండి. 

కర్కాటకం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. అనుకున్న సమయానికి నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికం.. అనుకున్న రాబడి దక్కి ఉత్సాహంగా గడుపుతారు. రుణబాధలు తొలగుతాయి. షేర్ల విక్రయాలు కాస్త అనుకూలిస్తాయి. కుటుంబం..సంతానపరంగా సౌఖ్యం. వారి నుంచి శుభవార్తలు. సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆరోగ్యం… కొంత శ్రద్ధ చూపండి.. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఉన్నతెదాలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారుల యత్నాలు అనుకూలిస్తాయి. మహిళలకు సోదరులతో సఖ్యత. తూరు’దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించండి. 

సింహం: ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మీకు సహాయపడతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. నిరుద్యోగుల యత్నాలు సఫలం. ఆర్థికం…కొంత సొమ్ము అప్రయత్నంగా దక్కుతుంది. అప్పుల బాధలు తొలగుతాయి. కుటుంబం…ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. సోదరీ,సోదరుల మధ్య సఖ్యత.సంతానపరంగా కీలక సమాచారం అందుతుంది. ఆరోగ్యం…అకాల ఆహారవిహారాదుల స్వల్ప అనారోగ్యం. ఔషధసేవనం.  వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులు విధుల్లో ఉత్సాహంగా సాగుతారు. పారిశ్రామికవేత్తలకు కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది.  కళాకారులకు ఎట్టేకలకు అవకాశాలు దక్కుతాయి. మహిళలకు మానసిక ప్రశాంతత. దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం. శివాష్టకం పఠించండి. 

కన్య: ప్రారంభంలో నెలకొన్న ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి  కొన్ని సమస్యలు ఒక్కొక్కటీ తీరతాయి. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి.  కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికం….కొంత ఊరట చెందే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల వల్ల నిలిచిపోయిన సొమ్ము అందుతుంది. రుణదాతల నుంచి విముక్తి. కుటుంబం…వివాదాలు కొన్ని పరిష్కరించుకుంటారు. సోదరులు, సోదరీలతో మరింత సఖ్యత నెలకొంటుంది. శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ఆరోగ్యం…శారీరక రుగ్మతలు కొంత బ్యాధిస్తాయి. వ్యాపారాలు అనుకున్న మేరకు లాభిస్తాయి.  ఉద్యోగులకు కొత్త బాధ్యతలు తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు. కళాకారుల యత్నాలు ఫలిస్తాయి. మహిళలకు ఆస్తిలాభ సూచనలు. పశ్చిమదిశ ా ప్రయాణాలు అనుకూలం. శ్రీషిర్డీసాయి స్తోత్రాలు పఠించండి. 

తుల: ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి కాగలవు. మిత్రుల సహాయసహకారాలు అందుకుంటారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆర్థికం.. ఊహించని రీతిలో సొమ్ము సమకూరుతుంది. రుణాలు కాస్త తీరతాయి. షేర్ల విక్రయాలు సకాలంలో పూర్తి చేసి సొమ్ము అందుకుంటారు. కుటుంబం… బంధువుల నుంచి అందిన సమాచారం మీలో నూతనోత్తేజం కలిగిస్తుంది. సోదరీలతో ఆస్తి విషయంలో ఒక అంగీకారానికి వస్తారు. ఇంట్లో దైవకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం.. ఆరోగ్యపరంగా కాస్త మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో భాగస్వా ములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో కొంత అనుకూల పరిస్థితి. పారిశ్రామి కవేత్తలకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. మహిళలకు శుభవార్తలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి. 

వశ్చికం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు.  మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. పట్టుదలతో కొన్ని చిక్కుల నుంచి బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. ఆర్థికం…రావలసిన డబ్బు సమకూరుతుంది. ఆస్తుల విక్రయాలు సకాలంలో పూర్తి చేసి మరింత డబ్బు అందుకుంటారు. కుటుంబం….అందరి ఆదరణ పొందుతారు. శుభకార్యాల నిర్వహణపై బంధువులతో చర్చిస్తారు. మీ ఆలోచనలు అందరూ అంగీకరిస్తారు. విదేశాలలోని సంతానం నుంచి ఊరట చెందే సమాచా రం అందుతుంది. ఆరోగ్యం…కాస్త చికాకులు కలిగినా ఉపశమనం పొందుతారు. వ్యాపారులకు అధికలా భాలు. ఉద్యోగులు కొత్త ఆశలతో ముందుకు సాగు తారు. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు భూలాభాలు. దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. 

ధనుస్సు: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శ్రేయోభిలాషుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కివస్తుంది. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. విద్యార్థుల కొంత అనుకూలం. ప్రస్తుత పరిస్థితుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఆర్థికం… ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రుణాలు తీరతాయి. ఇతరులు సైతం మీకు బాకీలు సకాలంలో చెల్లిస్తారు. కుటుంబం….మీ అంచనాలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. శుభకా ర్యాలకు మార్గం సుగమం కాగలదు. సంతానపరంగా మరింత సౌఖ్యం. ఆరోగ్యం…గతం కంటే మెరుగుపడి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.  పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.  మహిళలకు సంతోషకరమైన సమాచారం. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 

మకరం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవం పొందుతారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. ఆర్థికం…ఊహించని రీతిలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. షేర్ల విక్రయాలు పూర్తి చేసి కొంత సొమ్ము అందుకుంటారు. కుటుంబం.. భార్యాభర్తలమధ్య వివాదాలు సర్దుకుంటాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. మీపై బంధువులు మరిన్ని బాధ్యతలు ఉంచుతారు. ఆరోగ్యం…కొంత నలత చేసి ఉపశమనం లభిస్తుంది.  వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు విధుల్లో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. మహిళలకు స్వల్ప ధనలబ్ధి.. తూరు’దిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హదయం పఠించండి. 

కుంభం: ప్రస్తుత పరిస్థితుల రీత్యా పనులు కొన్ని కుదించుకుంటారు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరిచేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిర్ణయాలపై పునరాలోచనలో పడతారు. కష్టానికి ఫలితం కనిపించదు. విద్యార్థుల శ్రమ వథాగా మారుతుంది. ఆర్థికం…అనుకున్నంత ఆదాయం సమకూరక ఇబ్బంది పడతారు. రుణాల వేటలో పడతారు. కుటుంబం…బంధువులతో తగాదాలు ఏర’డతాయి. సంతానపరంగా కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. కొన్ని శుభకార్యాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం.. ఆరోగ్యం మందగించి వైద్యసేవలు పొందుతారు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు. ఉద్యోగులకు పనిఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి నిరాశాజనకంగా ఉంటుంది. కళాకారులకు అవకాశాలు కొంత అసంతప్తి కలిగిస్తాయి. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. తూరు’దిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయదండకం పఠించండి. 

మీనం: ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కాస్త ఊరట కలిగిస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. గహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. గత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. ఆర్థికం..రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. భూముల విక్రయాలు లాభించి మరింత సొమ్ము సమకూర్చుకుంటారు. కుటుంబం.. సోదరులు,సోదరీలతో వివాదాలు పరిష్కారం. అందరి ప్రేమ పొందుతారు. మీ ప్రయత్నాలకు కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఆరోగ్యం…ఆరోగ్యం పట్ల మాత్రం నిర్లక్ష్యం వద్దు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ెదాలు పెరిగే అవకాశం. రాజకీయ,పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. కళాకారులకు చిక్కులు తొలగుతాయి. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.

Vakkantham Chandra Mouli 
www.janmakundali.com