తమ్ముళ్ళు పాండవులైతే ఎందుకు ఓడారో మరి ?

అయ్యన్నపాత్రుడు ఈ మధ్య ట్విట్టర్ కి పని బాగా చెబుతున్నారు. పోయేదేముంది ఒక ట్వీట్ చేస్తే పార్టీ కోసం పనిచేసినట్లుగా ఉంటుంది. గట్టిగా కష్టపడుతున్నట్లుగా ఫీలింగ్ కూడా వస్తుంది అనుకున్నారేమో ఈ మాజీ మంత్రి…

అయ్యన్నపాత్రుడు ఈ మధ్య ట్విట్టర్ కి పని బాగా చెబుతున్నారు. పోయేదేముంది ఒక ట్వీట్ చేస్తే పార్టీ కోసం పనిచేసినట్లుగా ఉంటుంది. గట్టిగా కష్టపడుతున్నట్లుగా ఫీలింగ్ కూడా వస్తుంది అనుకున్నారేమో ఈ మాజీ మంత్రి గారు చాన్స్ దొరికితే ట్వీటేస్తున్నారు.

ఇక ట్విట్టర్లో అయన విజయసాయిరెడ్డిని శకుని మామతో పోల్చుతూ ఏదేదో వెటకారాలు ఆడారు. రాజకీయ విమర్శల వరకూ ఓకే అనుకున్నా తానూ, తన పార్టీ అచ్చమైన పాండవులం, ధర్మబద్ధులం అన్నట్లుగా అయ్యన్న కలరింగ్ ఇవ్వడమే ఇక్కడ పెద్ద చర్చ.

వైసీపీని కౌరవ సామ్రాజ్యంగా పోలుస్తూ అక్కడికి తామేదో అమాయకం అయినట్లుగా అయ్యన్న లాటి వారు ఎంత చెప్పుకున్నా జనం అసలు నిజం తెలుసుకున్నారు కాబట్టే గత ఏడాది జరిగిన ఎన్నికల్లోఓడించారు అని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

ఇంతకీ పాండవులు మాదిరిగా పాలిస్తే ఈ దారుణమైన ఘోర ఓటమి ఎందుకు ప్రాప్తిస్తుందో అయ్యన్న ఏడాది జరిగినా అసలు ఆలోచించినట్లుగా లేదని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఆత్మానందాం భజగోవిందం అన్న తరహాలో తాము మంచోళ్లం అని తమ్ముళ్లు ఎంత చెప్పుకున్నా జనాలు తీర్పు పేరిట గట్టి దెబ్బేశారుగా. ఇంతకీ   తాము పాండవులు అని చెప్పుకుంటున్న అయ్యన్న చంద్రబాబుకు ఏ పాత్ర ఇచ్చారో మరి.

నేను డీసెంట్.. రవితేజ పెద్ద క్రాక్