ఆర్టీవో 50, ఎమ్మార్వో 10 ?

ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించేయడం, నూరుశాతం ఆక్యుపెన్సీ ఇవ్వకపోవడం అన్నది రెవెన్యూ అధికారుల పంట పండిస్తోంది. ఆంధ్రలోని ఓ ఏరియాలో కొత్త సిస్టమ్ కు తెరతీసారని తెలుస్తోంది.  Advertisement రెవెన్యూ అధికారులు టికెట్ రేట్లు,…

ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించేయడం, నూరుశాతం ఆక్యుపెన్సీ ఇవ్వకపోవడం అన్నది రెవెన్యూ అధికారుల పంట పండిస్తోంది. ఆంధ్రలోని ఓ ఏరియాలో కొత్త సిస్టమ్ కు తెరతీసారని తెలుస్తోంది. 

రెవెన్యూ అధికారులు టికెట్ రేట్లు, అలాగే ఆక్యుపెన్సీ చూసీ చూడకుండా వదిలేయడానికి డిస్ట్రిబ్యూటర్లు ఓ కొత్త మార్గం ఎంచుకున్నారు.

కాస్త బజ్ వుంది, నూరు శాతం ఆక్యుపెన్సీ అవసరం పడుతుంది అనుకున్న ప్రతి సినిమాకు ఆర్వీవోకు యాభై వేలు, ఎమ్మార్వోకు పది వేలు వంతున పంపేస్తున్నారట. ఆ ఏరియాలోని వున్న అందరు ఆర్టీవోలు, ఎమ్మార్వోలకు ముందుగానే పంపిస్తున్నారట. 

బాహాటంగానే రేట్లు తగ్గించకుండా అమ్మేయడం జరుగుతోంది. ఆర్టీవోలు, ఎమ్మార్వోలు చూసీ చూడకుండా వదిలేస్తున్నారు. అలాగే నూరుశాతం ఆక్యుపెన్సీ ని వదిలేస్తున్నారు. 

దీని వల్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు ఉపయోగం లేకుండా పోతోంది. ఈ విషయం ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది.