నా కెరీర్ లో మొదటి రియలిస్టిక్ మూవీ ఇది

“క్రాక్” సినిమాను తన కెరీర్ లో రియలిస్టిక్ సినిమాగా చెప్పుకొచ్చాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. సినిమా కమర్షియల్ మీటర్ లోనే ఉంటూ చాలా రియలిస్టిక్ గా ఉంటుందని చెబుతున్నాడు. Advertisement “నా నుంచి క్రాక్…

“క్రాక్” సినిమాను తన కెరీర్ లో రియలిస్టిక్ సినిమాగా చెప్పుకొచ్చాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. సినిమా కమర్షియల్ మీటర్ లోనే ఉంటూ చాలా రియలిస్టిక్ గా ఉంటుందని చెబుతున్నాడు.

“నా నుంచి క్రాక్ లాంటి సినిమా ఊహించరు. ఇదొక రియలిస్టిక్ ఎప్రోచ్ ఉన్న సినిమా. ఒంగోలు బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. కథ ప్రకారం కర్నూలు, కడప, ఒంగోలులో సినిమా ఉంటుంది. పక్కా కమర్షియల్ సినిమానే అయినప్పటికీ అన్నీ వాస్తవ ఘటనలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. నా కెరీర్ లో ఇంత రియలిస్టిక్ సినిమా లేదు.”

రవితేజ-గోపీచంద్ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ. ఇంతకుముందొచ్చిన బలుపు, డాన్ శీను టైపులోనే ఇది కూడా రవితేజ మార్క్ సినిమానే అంటున్నాడు గోపీచంద్. అయితే వాస్తవ ఘటనలు చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందని చెబుతున్నాడు. మూవీ రిలీజ్ పై కూడా రియాక్ట్ అయ్యాడు.

“కరోనా వచ్చిన తర్వాత షూటింగ్స్, రిలీజ్ లు ఆగిపోయాయి. ప్రస్తుతానికి అందరం వెయిటింగ్ మోడ్ లో ఉన్నాం. ఇండస్ట్రీ రీస్టార్ట్ అవ్వడానికి ఓ పాజిటివ్ సైన్ కోసం ఎదురుచూస్తున్నాం. వ్యాక్సీన్ వచ్చిన తర్వాత అందర్లో భయం పోతుందనుకుంటున్నాం. ఆగస్ట్ లేదా సెప్టెంబర్.. ఇలా ఏ నెలకు ఆ నెలలో థియేటర్లలోకి వచ్చేందుకు ఎదురుచూస్తున్నాం.”

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం క్రాక్ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. అదే కనుక సాధ్యమైతే.. టాలీవుడ్ నుంచి నేరుగా ఓటీటీలోకి వస్తున్న పెద్ద హీరో సినిమా ఇదే అవుతుంది.