పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలిప్రేమ సినిమా ఓ మైల్ స్టోన్. ఇప్పుడు అదే డేట్ ను ఆర్జీవీ తను పవర్ స్టార్ సినిమా విడుదలకు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. జూలై 24 1998 న తొలిప్రేమ విడుదలయింది. ఈ నెల 24న పవర్ స్టార్ విడుదల కావడానికి అవకాశం వుంది. పదిశాతం షూటింగ్ మినహా మిగిలిన సినిమా పూర్తయిపోయిందని తెలుస్తోంది.
రామోజీ ఫిలిం సిటీ సమీపంలోని ఓ పాత రిసార్ట్ మొత్తాన్ని రామ్ గోపాల్ వర్క లీజకు తీసుకున్నట్లో, తీసుకుంటున్నట్లో తెలుస్తోంది. ఇకపై సినిమాలు, షూటింగ్ లు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం అక్కడి నుంచే నిర్వహిస్తారని తెలుస్తోంది. అంటే హైదరాబాద్ లో ఆర్జీవీ తనకు అంటూ ఓ ప్రయివేటు స్టూడియో లాంటిది సెట్ చేసుకుంటున్నారన్న మాట.
రిసార్ట్ అనగానే బోలెడు ఖాళీ ప్రదేశం వుంటుంది. సకల సదుపాయాలు వుంటాయి. అక్కడే ఆయన చిన్న సినిమాలు మొత్తం లాగించేయవచ్చు. ట్రాన్స్ పోర్ట్, లోకేషన్ల వేట, స్టూడియో అద్దెలు ఇవన్నీ చూసుకుంటే ఇది చాలా సౌలభ్యంగా వుంటుంది కూడా.