దిల్‌రాజ్ కుమార్తె ఎమోష‌న‌ల్ పోస్ట్‌

ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ దిల్‌రాజ్ అలియాస్ వి.వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మొద‌టి భార్య కుమార్తె హ‌న్షిత‌రెడ్డి సోష‌ల్ మీడియాలో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆమె త‌న త‌ల్లి అనిత జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూ…

ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ దిల్‌రాజ్ అలియాస్ వి.వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి మొద‌టి భార్య కుమార్తె హ‌న్షిత‌రెడ్డి సోష‌ల్ మీడియాలో ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆమె త‌న త‌ల్లి అనిత జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూ భావోద్వేగ కామెంట్స్ పెట్టారు.

దిల్‌రాజ్ మొద‌టి భార్య అనిత 2017, మార్చిలో గుండెపోటుతో మృతి చెందిన విష‌యం తెలిసిందే. మొద‌టి భార్య కుమార్తె హ‌న్షిత‌రెడ్డి. త‌ల్లి మృతితో నాన్న దిల్‌రాజ్ ఒంట‌రి జీవితాన్ని గ‌డ‌ప‌డం కూతురి మ‌న‌సు త‌ట్టుకోలేక పోయింది. దీంతో ఎయిర్‌హోస్టెస్ తేజ‌స్వినితో దిల్‌రాజ్‌కు కూతురే స్వ‌యంగా ఇటీవ‌ల పెళ్లి జ‌రిపించింది.

కాగా త‌న త‌ల్లి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని హ‌న్షిత‌రెడ్డి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమెతో గ‌డిపిన మ‌ధుర జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకొంది. అమ్మ‌తో త‌న‌కున్న అనుబంధాన్ని ప‌లువురితో పంచుకుంది.

“అమ్మా పుట్టినరోజు శుభాకాంక్షలు . నిన్ను చాలా మిస్ అవుతున్నా. ఇప్ప‌టికీ ఎప్పటికీ నీ జ్ఞాపకాలతోనే జీవిస్తున్నా. నీతో ఎన్నో జ్ఞాపకాలు. నేను ఎక్కువగా నీతో కలిసి ఫోటోలు దిగాను. నీ చిరునవ్వు  దృశ్యాల చిత్రాలెన్నో. నీ దృష్టిలో ప్రేమ అంటే… ఎప్పటిలాగే నన్ను గట్టిగా కౌగిలించుకోవ‌డం” అంటూ హన్షిత భావేద్వేగ పోస్ట్ పెట్టారు. ఈ సంద‌ర్భంగా త‌ల్లితో చిన్న నాటి ఫొటోల‌ను ఆమె హేర్ చేశారు. అలాగే త‌ల్లిదండ్రుల ఫోటోను కూడా ఆమె షేర్ చేశారు.

హ‌న్షిత‌కు ఇషిక అనే కూతురు ఉంది. కూతురి రూపంలో త‌న త‌ల్లి తిరిగి వ‌చ్చింద‌ని హ‌న్షిత  సంతోషం వ్యక్తం చేయడం తెలిసిందే.  త‌ల్లిదండ్రులపై హన్షిత త‌న మ‌న‌సులో ప్రేమ‌ను సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా వ్య‌క్త ప‌ర‌చ‌డం చూస్తూనే ఉన్నాం.

చంద్రబాబు కలల్లోకొచ్చి భయపెడుతున్నాడు

చంద్రబాబు ఆకాశం మీద ఉమ్మేస్తున్నాడు