అందమైన యువతులు, మహిళలు పోలీస్‌స్టేషన్‌కు వస్తే చాలు…ఇక వారికి మనశ్శాంతి కరువైనట్టు. ఓ మన్మథ సీఐ చేతికి చిక్కితే ఇక అంతే సంగతులు. ఏకంగా ఆ సీఐతో బలవంతంగా పదవీ విరమణ చేయించారంటే….అతని లీలలు ఏ స్థాయిలో సాగి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. కనురెప్పే కాటేస్తే ఎంత దుర్మార్గంగా ఉంటుందో…రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారే వేధిస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలి? ఓ యువతి ఫిర్యాదుతో చివరికి ఇంటిబాట పట్టిన మన్మథ పోలీస్ ఆఫీసర్ గురించి తెలుసుకుందాం.
సీఐ మణివణ్ణన్‌కు విపరీతమైన అమ్మాయిల మోజు. అందమైన అమ్మాయిలపై ఆయన కన్ను పడిందా…ఇక లొంగదీసుకోడానికి ఏ స్థాయికైనా దిగజారుతాడనే పేరు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మన్నచ్చనల్లూరు సిరవనూరు పోలీస్ స్టేషన్‌లో సీఐగా మణివణ్ణన్ విధులు వెలగబెట్టేవాడు. ఆయన ఎక్కడ పనిచేసినా మహిళలపై వేధింపులకు పాల్పడేవాడని సమాచారం.
భార్యాభర్తల మధ్య లేదా ఇతరత్రా సమస్యలతో పోలీస్‌స్టేషన్‌కు మహిళలు, యువతులు వస్తే …తన గదిలోకి పిలిపించుకునే వాడు. ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించేవాడు. ఆ సందర్భంలో మణివణ్ణన్ ఎంతో మర్యాదగా మాట్లాడే తీరును బట్టి ఆయన ఎంతో మంచివాడని నమ్మేవారు. నమ్మితేనే కదా ఎవరైనా మోసపోయేది.
మణివణ్ణన్ విషయంలో కూడా మోసపోయిన మహిళలు కూడా ఇదే చెబుతారు. ఫిర్యాదు చేసిన మహిళ ఫోన్ నంబర్లు తీసుకునే సీఐ…ఆ తర్వాత తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. విచారణ పేరిట సమయం సందర్భం లేకుండా బాధిత మహిళలకు రాత్రి వేళ ఫోన్ చేసి ప్రేమ పాఠాలు వల్లించడం స్టార్ట్ చేస్తాడు.
అయితే ఓ యువతి విషయంలో అతని వ్యవహారం బెడిసి కొట్టింది. సదరు బాధిత యువతిని లొంగదీసుకునేందుకు శత విధాలా ప్రయత్నించాడు. ఆమె లొంగకపోవడంతో చివరికి బాధితురాలిపైనే కేసు పెట్టేందుకు వెనుకాడలేదు. సీఐ వేధింపులకు విసిగిపోయిన బాధిత యువతి నేరుగా డీఐజీ బాలకృష్ణన్‌కు ఫిర్యాదు చేసింది. సీఐ నిజస్వరూపాన్ని కళ్లకు కట్టింది. అలాగే తన వద్ద ఉన్న ఆడియో ఆధారంగా సమర్పించింది.
సీఐ మన్మథ లీలలపై డీఐజీ రహస్య విచారణ జరిపించాడు. ఈ సందర్భంగా సీఐ విధుల నిర్వహణలో ఎక్కడెక్కడ ఎలాంటి రాసలీలలు సాగించాడో అనేక విషయాలు వెలుగు చూశాయి. దీంతో డీఐజీకి షాక్ కొట్టినంత పనైంది. ఇతన్ని ఇలాగే సర్వీస్‌లో కొనసాగిస్తే మరింత మంది బాధితులుగా మిగిలే ప్రమాదం ఉందని గ్రహించిన డీఐజీ చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాడు.
మణివణ్ణన్‌కు ఇంకా ఆరేళ్లు సర్వీస్ ఉండగానే…ఇంటికి సాగనంపాలని డీఐజీ గట్టిగా నిర్ణయించుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ముందే పసిగట్టిన సీఐ సెలవు పెట్టి వెళ్లిపోయాడు. ఈ లోపు డీఐజీ బదిలీ జరిగింది. దీంతో మళ్లీ డ్యూటీలో చేరేందుకు సీఐ మణివణ్ణన్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే స్టేషన్‌కు వెళ్లిన మణివణ్ణన్‌కు డీఐజీ భారీ షాక్ ఇచ్చాడు. అప్పటికే అతన్ని బలవంతంగా పదవీ విరమణ చేసినట్టు ఆదేశాలు రావడం మణివణ్ణన్‌కు మింగుడు పడలేదు. ఏది ఏమైతేనేం మన్మథ లీలలు అతని పదవికి ఎసరు తెచ్చాయి. ప్రస్తుతం మణివణ్ణన్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.