మరింత ముందుకు విశాఖ రాజధాని?

విశాఖ రాజధాని విషయంలో  మరో అడుగు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వేసే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖ పాలనా రాజధాని చేస్తామని జగన్ సర్కార్ నిండు అసెంబ్లీలో చెప్పిన తరువాత అనేక కీలక పరిణామాలు జరిగాయి.…

విశాఖ రాజధాని విషయంలో  మరో అడుగు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వేసే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖ పాలనా రాజధాని చేస్తామని జగన్ సర్కార్ నిండు అసెంబ్లీలో చెప్పిన తరువాత అనేక కీలక పరిణామాలు జరిగాయి.

దాంతో రాజధాని కధ అక్కడితో సరి అని అంతా అనుకున్నారు. అయితే అది ఆగేది కాదని, సాగేదేనని పదే పదే వైసీపీ సర్కార్ పెద్దల మాటల ద్వారా అర్ధమవుతూనే ఉంది. ఈ నేపధ్యంలో కరోనా మహమ్మారి వచ్చి పడింది.

దాంతో కొన్నాళ్ళు విశాఖ రాజధాని ఊసు తగ్గినా ఇపుడిపుడే మళ్ళీ జోరందుకుంటోంది. ఈ మధ్యనే విశాఖలో రెండు రోజులు మకాం చేసి వెళ్ళిన డీజీపీ గౌతం సవాంగ్ వంటి వారు అయితే  సర్కార్ ఎపుడు ఆదేశించినా  విశాఖ రాజధానికి వచ్చేస్తామని చెప్పి మళ్ళీ కాపిటల్ సిటీ ఆశలను పెంచేశారు.

ఇవన్నీ ఇలా ఉంటే ఈ నెల మూడవ వారంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ఉందని భోగట్టా. ఈ సమావేశంలో విశాఖను పాలనా రాజధానిగా చేసే విషయం మరోమారు చర్చిస్తారని అంటున్నారు. ఆ విధంగా  రాజధాని ఎక్స్ ప్రెస్ ని అమరావతి నుంచి వడి వడిగా విశాఖ తీరం చేరుస్తారని తెలుస్తోంది.

అదే కనుక జరిగితే అంతా అనుకుంటున్నట్లుగానే  అక్టోబర్ 25 విజయదశమి శుభవేళ విశాఖ నుంచి ముఖ్యమంత్రి జగన్ పాలన చేయడం ఖాయమని చెబుతున్నారు. మొత్తానికి విశాఖ రాజధాని అన్నది మరింత ముందుకు వస్తోంది.

నేను డీసెంట్.. రవితేజ పెద్ద క్రాక్

చంద్రబాబు కలల్లోకొచ్చి భయపెడుతున్నాడు