ఓటిటి రంగంలోకి దిల్ రాజు

డిస్ట్రిబ్యూటర్ గా ప్రారంభమై, నిర్మాతగా మారి, థియేటర్లను కంట్రోల్ లోకి తీసుకుని, యువి, గీతా ఇలా అందరినీ కలుపుకుని, ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు దిల్ రాజు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్ట్ అనే ఆలోచన…

డిస్ట్రిబ్యూటర్ గా ప్రారంభమై, నిర్మాతగా మారి, థియేటర్లను కంట్రోల్ లోకి తీసుకుని, యువి, గీతా ఇలా అందరినీ కలుపుకుని, ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగారు దిల్ రాజు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్ట్ అనే ఆలోచన చేసి, మొత్తం వ్యవహారాలు తన అదుపులోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఓటిటి రంగంలోకి ప్రవేశిస్తున్నారు.

అయితే ఓటిటి ప్లాట్ ఫారమ్ స్టార్ట్ చేయడం లేదు. కంటెంట్ తయారీ, అలాగే ఎవరైనా ఓటిటికి ఏమైనా కంటెంట్ విక్రయించాలన్నా, తయారు చేయాలన్నా మధ్యవర్తిగా వ్యవహారించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయనకు వేరే వాళ్లతో కలిసి శాటిలైట్ హక్కుల కొనుగోలు, అమ్మకాల వ్యాపారం వుంది అని ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు అదే రీతిగా ఓటిటి లోకి కూడా ప్రవేశిస్తున్నారు.

హిట్ డైరక్టర్ శైలేష్ కథ అందిస్తుంటే, ఎడిటర్ గ్యారీని దర్శకుడిగా మారుస్తూ, హీరో విష్వక్ సేన్ నిర్మాతగా ఓ ఓటిటి సినిమా తయారు చేయించే పనిలో వున్నారని తెలుస్తోంది. దీనికి ఫండింగ్ దిల్ రాజు ఏర్పాటుచేస్తున్న సంస్థ అందిస్తుంది. ఇలా ఎవరైనా ఇంట్రస్టింగ్ ప్రాజెక్టులు తెస్తే, ఈ సంస్థ ఫండింగ్ ఇచ్చి, ప్రాజెక్టు హక్కులు కొనుగోలు చేస్తుందని తెలుస్తోంది. ఆ తరువాత వాటిని వాళ్లు అమ్ముకుంటారు.

అయితే శైలేష్-గ్యారీ-విష్వక్ సేన్ ప్రాజెక్టు కు ఓ అప్ కమింగ్ చిన్న హీరోను సంప్రదించినట్లు, నేరుగా ఓటిటికి చేయడం అంటే కాస్త ఆలోచించాలని చెప్పినట్లు తెలుస్తోంది. సినిమాలతో పాటే ఇక దిల్ రాజు ఓటిటి కంటెంట్ లొ కూడా తనదైన ముద్ర వేస్తారన్నమాట.

చంద్రబాబు కలల్లోకొచ్చి భయపెడుతున్నాడు

చంద్రబాబు ఆకాశం మీద ఉమ్మేస్తున్నాడు