అంతా రెడీ.. అయోమయంలో సుకుమార్

పక్కా ప్లానింగ్ తో సినిమాలు తీసే దర్శకులే ఈ కరోనా దెబ్బకు విలవిల్లాడిపోయారు. కాల్షీట్లన్నీ మురిగిపోయి, షెడ్యూల్స్ అన్నీ చెల్లాచెదురైపోయి ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోయారు. ఇక సినిమాల్ని నెలల తరబడి…

పక్కా ప్లానింగ్ తో సినిమాలు తీసే దర్శకులే ఈ కరోనా దెబ్బకు విలవిల్లాడిపోయారు. కాల్షీట్లన్నీ మురిగిపోయి, షెడ్యూల్స్ అన్నీ చెల్లాచెదురైపోయి ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోయారు. ఇక సినిమాల్ని నెలల తరబడి చెక్కే సుకుమార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడీయన పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

ఫ్రేమ్ బై ఫ్రేమ్.. సీన్ బై సీన్.. నిదానంగా తీయడం సుకుమార్ స్టయిల్. సెట్స్ పైకి వెళ్లిన తర్వాత కూడా సీన్ లో చిన్న చిన్న మార్పులు చేసి, అదే సీన్ ను మరుసటి రోజు తీయడం సుకుమార్ కు అలవాటు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా సుకుమార్ స్టయిల్ కు విరుద్ధంగా మారాయి.

తక్కువ మంది యూనిట్ సభ్యులతో సినిమా తీయాలి. పైగా వేగంగా తీయాలి. మరిన్ని జాగ్రత్తలు తీసుకొని తీయాలి. రీషూట్ చేయాలంటే ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి. ఇలా సుకుమార్ ముందు అన్నీ బంధనాలే ఉన్నాయి. ఇవన్నీ పక్కనపెడితే, ఉన్నఫలంగా హీరో ఓకే అంటే ఎక్కడ షూట్ చేయాలనేది కూడా సుకుమార్ కు అయోమయంగా మారింది. అందుకే ఒకటికి రెండు ఆప్షన్లు సిద్ధం చేసుకున్నాడీయన.

ఈ టైమ్ లో ఈస్ట్ గోదావరి వరకు ఎందుకనుకున్నారేమో.. హైదరాబాద్ కు దగ్గర్లో ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలోని అడవుల్లో షూట్ చేయాలని తాజాగా నిర్ణయించారు. ఔట్ డోర్ షూటింగ్ కు బన్నీ ఓకే అంటే మహబూబ్ నగర్ అడవుల్లో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికిప్పుడు ఔట్ డోర్ వద్దనుకుంటే అన్నపూర్ణ స్టుడియోస్ లో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ రెండూ వద్దనుకుంటే.. ఫిలింసిటీలో వేస్తున్న సెట్ లో పాటల షూటింగ్ మొదలవుతుంది. ఈ మేరకు సాంగ్స్ కూడా ఫైనల్ చేశాడు సుక్కు.

కానీ హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ లేదు. కరోనాకు వ్యాక్సిన్ వస్తే తప్ప బయటకొచ్చేలా లేడు బన్నీ. దీంతో సుక్కూ మరింత అయోమయంలో పడిపోయాడు. 

చంద్రబాబు కలల్లోకొచ్చి భయపెడుతున్నాడు