షాకింగ్.. పవర్ స్టార్ పై నాగబాబు నో రియాక్షన్

“అన్నయ్యని కానీ, తమ్ముడ్ని కానీ పల్లెత్తు మాట అన్నా నేను తట్టుకోలేను.. వెంటనే బదులు చెప్తా”. ఇదీ గతంలో మెగా బ్రదర్ నాగబాబు స్టేట్ మెంట్. ఆ మాట ప్రకారమే పలు సందర్భాల్లో నాగబాబు…

“అన్నయ్యని కానీ, తమ్ముడ్ని కానీ పల్లెత్తు మాట అన్నా నేను తట్టుకోలేను.. వెంటనే బదులు చెప్తా”. ఇదీ గతంలో మెగా బ్రదర్ నాగబాబు స్టేట్ మెంట్. ఆ మాట ప్రకారమే పలు సందర్భాల్లో నాగబాబు అందరిపై నోరు చేసుకున్నారు కూడా. శ్రీరెడ్డి వ్యవహారంలో నాగబాబు రియాక్షన్స్ కాస్త ఘాటుగానే ఉన్నాయి. ఇక అన్నయ్య విషయంలో అయితే, తమ్ముడి ఫ్యాన్స్ ని కూడా లెక్కచేయరు మెగా బ్రదర్.

అలాంటి నాగబాబు వర్మ “పవర్ స్టార్” సినిమా పోస్టర్ తదనంతర పరిణామాలపై ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఏమీ పట్టనట్టు ఏబీవీపీ వార్షికోత్సవం, దలైలామాతో మధుర క్షణాలు అంటూ ట్వీట్లు వేసుకుని గప్ చుప్ అయ్యారెందుకు? సగటు మెగాభిమానులంతా ఇదే విషయంపై దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. పోనీ పవన్ ఒక్కరినే వర్మ టార్గెట్ చేశారా అంటే అదీ లేదు.. చిరంజీవిని కూడా ఇరికించేసి మరీ రెచ్చగొట్టారు. అయినా సరే నాగబాబు సంయమనం పాటిస్తూనే ఉన్నారు. 

వర్మ ట్వీట్లపై ఆయన రియాక్షన్ బాగా లేటయిందనే అంటున్నారు ఆయన స్వభావం తెలిసినవారు. అయితే అదంతా పవన్ పై మెగాబ్రదర్ కు ఉన్న చిరు కోపమేనని తెలుస్తోంది. గతంలో గాడ్సేపై నాగబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో జనసేనకు ఏ సంబంధం లేదని పవన్ కల్యాణ్ ఓ క్లారిటీ ఇచ్చారు. అక్కడే అన్నాదమ్ములిద్దరికీ వ్యవహారం కాస్త బెడిసికొట్టింది. ఆ తర్వాత జనసేన కార్యకలాపాలకి నాగబాబు పూర్తిగా దూరం జరిగారు. కనీసం ఓ ట్వీట్ కూడా వేయడం లేదు. ఇక పవన్ కల్యాణ్ ని నేరుగా కలసిన సందర్భమూ లేదు. దాదాపు జనసేనకి నాగబాబు దూరమయ్యారనే అనుకున్నారంతా.

అదే సమయంలో కరోనా క్రైసిస్ టైమ్ లో చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాత్రం నాగబాబు చాలా తీవ్రంగా స్పందించారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పటి సీన్ లోకి వస్తే.. పవర్ స్టార్ సినిమా పోస్టర్, తర్వాత వరుసగా విడుదలైన స్టిల్స్ తో మెగాభిమానుల్ని ఎక్కడ కెలకకూడదో అక్కడే టచ్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఒక్కరోజులోనే ఏపీ సోషల్ మీడియాలో కరోనాపై పోస్ట్ లు తగ్గిపోయి పవర్ స్టార్ సినిమాపై రియాక్షన్స్ ఎక్కువయ్యాయి. పవన్ ఫ్యాన్స్ వర్మని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.

అయితే ఇక్కడ నాగబాబు మౌనమే సందేహాస్పదంగా మారింది. తమ్ముడిపై ఈగ వాలినా ఒప్పుకోని మెగా బ్రదర్, ఇప్పుడు పెద్ద బండనే వేయబోతున్న వర్మపై ఎందుకు నోరు చేసుకోలేదు. ఓ ట్వీట్ వేస్తే అలా పడుండేది కదా, అయినా ఆయన బైటకి రాలేదు. మెగా ఫ్యాన్స్ కూడా నాగబాబు ఘాటు రియాక్షన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. పవన్ పై నాగబాబు అలక తీరిందా లేదా అనేది ఆయన రియాక్షన్ ని బట్టి అర్థమవుతుంది.

చంద్రబాబు కలల్లోకొచ్చి భయపెడుతున్నాడు