జయలలితతో పోలికేంటి తమ్ముళ్ళూ ?

తెలుగు తమ్ముళ్లకు బహు చక్కని సుభాషితమే వినిపించారు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. మేము పరిషత్తు ఎన్నికలను బహిష్కరించామని తెగ గొప్పాలు కొడుతున్న వారికి అందులోని లోగుట్టు విప్పి  మరీ చెప్పారు. Advertisement జయలలిత…

తెలుగు తమ్ముళ్లకు బహు చక్కని సుభాషితమే వినిపించారు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. మేము పరిషత్తు ఎన్నికలను బహిష్కరించామని తెగ గొప్పాలు కొడుతున్న వారికి అందులోని లోగుట్టు విప్పి  మరీ చెప్పారు.

జయలలిత కూడా లోకల్ బాడీస్ ఎన్నికలను బహిష్కరించింది అంటున్న వారుకు అర్ధమయ్యేలా ఆయన చాలానే చెప్పారు. జయలలిత తమిళనాడులో అప్పట్లో జరిగిన ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయకుండా బాయ్ కాట్ చేశారని దాడి గుర్తు చేశారు. అదే చంద్రబాబు తీరు చూస్తే నామినేషన్లు వేసి ఎన్నికలు దగ్గరలో ఉండగానే బహిష్కరణ పిలుపు ఇవ్వడం అంటే అది పచ్చి బూటకం, నాటకమని కూడా తేల్చేశారు.

పైగా తమ్ముళ్లకు లోపాయికారీగా మీరు పోటీలో ఉండంది, నేను ఇలాగే చెబుతాను అంటూ సందేశం కూడా తెలుగుదేశం పెద్దలు ఇచ్చారని దాడి సెటైర్లు వేశారు. ఇంత చేసినా ఘోరమైన ఓటమి టీడీపీకి  దక్కిందని ఆయన అన్నారు.

ఇక దేశ చరిత్రలో చూసుకుంటే మొత్తానికి మొత్తం లోకల్ బాడీస్ గెలిచిన చరిత్ర ఏ జాతీయ, ప్రాంతీయ పార్టీలకు లేదని ఆయన అన్నారు. అది ఒక్క జగన్ కే సాధ్యమైందని ఆయన అన్నారు. 

జగన్ కూడా ఎన్నికల ప్రణాళికను తుచ తప్పకుండా అమలు చేయడం వల్లనే ప్రజలు దీవించారని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి జయలలితతో  పోలిక పెట్టుకోకండి తమ్ముళ్ళూ అంటూ దాడి మాస్టార్ బాగానే పాఠం చెప్పారు.