ఎన్నికలట.. ఆ పత్రిక చెప్పింది, చంద్రబాబు అన్నారు!

ముందుగా తెలుగుదేశం ఆఫీసు నుంచి ఆ పత్రికకు స్క్రిప్ట్ వెళ్తుంది, ఆ తర్వాత ఆ స్క్రిప్టును పట్టుకుని తెలుగుదేశం పార్టీ వాళ్లు నానా హడావుడి చేస్తారు.. దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది అనేది తెలుగువారి మధ్యన…

ముందుగా తెలుగుదేశం ఆఫీసు నుంచి ఆ పత్రికకు స్క్రిప్ట్ వెళ్తుంది, ఆ తర్వాత ఆ స్క్రిప్టును పట్టుకుని తెలుగుదేశం పార్టీ వాళ్లు నానా హడావుడి చేస్తారు.. దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది అనేది తెలుగువారి మధ్యన గట్టిగా వినిపించే అభిప్రాయం. ఆ క్రమాన్ని జనాలు దశాబ్దాల నుంచి గమనిస్తూనే ఉన్నారు.

విశేషం ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడినా.. ఆ క్రమం మాత్రం తప్పడంలేదు. ఆ పత్రికల్లో ఏది అచ్చు అవుతుందో చంద్రబాబు నాయుడు అదే మాట్లాడుతూ ఉన్నారు. ముందస్తు ఎన్నికల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడేశారు. మరో మూడేళ్లలోనే ఎన్నికలు వస్తాయట. కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడునెలలు అయినంతలోనే చంద్రబాబు నాయుడు ఎన్నికలు అంటూ అప్పుడే మొదలెట్టేశారు.

ఈ మొదలెట్టడానికన్నా మునుపు.. ఆ పత్రిక ముందస్తు ఎన్నికలకు శంఖం ఊదింది. బీజేపీ మనసులో మాట అంటూ ఎన్నికల కోసం ఆ పత్రిక ఉబలాటపడింది. జమిలి ఎన్నికలు అని, రెండు వేల ఇరవై రెండు లేదా రెండు వేల ఇరవై మూడు ఆరంభంలో ఎన్నికలంటూ ఊదరగొట్టింది. ఆ పత్రికలో ఆ వార్తలు వచ్చాయి.. చంద్రబాబు నాయుడు మంగళవారం అదే విషయాన్నే ప్రకటించారు.

ఈ డ్రామాలు కొత్తవేమీ కావు. అయినా.. తెలుగుదేశం పార్టీ ముందు తన సంస్థాగత నిర్మాణం గురించి ఆలోచించుకుంటే మంచిదేమో. మూడేళ్లలో ఎన్నికలు వచ్చేస్తున్నాయని వాటి వెనుక సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించకుండా.. అప్పుడే మళ్లీ అధికార యావను వ్యక్తం చేయకుండా.. లోకేష్ ను ఎలా నాయకుడిగా ప్రజెంట్ చేసుకోవాలి, లోకేష్ ను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి.. అనే అంశాల గురించి తెలుగుదేశం అనుకూల మీడియా, చంద్రబాబు నాయుడు కసరత్తు చేసుకోవాలని పరిశీలకులు సూచిస్తున్నారు.

మూడేళ్లలో ఎన్నికలు, నాలుగేళ్లలో ఎన్నికలు అనేదాని కన్నా.. వచ్చే ఎన్నికలు ఎప్పుడో ఒకప్పుడు రానే వస్తాయి.. అంతవరకూ ప్రతిపక్షంగా ఏం చేయాలో టీడీపీ ఆలోచించుకుంటే మంచిదేమో అని అంటున్నారు.

ఎంత పని చేసావయ్యా సుజీత్‌!