సాక్షి ది మ్యూట్ ఆర్టిస్ట్

అనుష్కను తెరపై చూసి ఏడాది దాటిపోతోంది. ఈలోగా రకరకాల గ్యాసిప్ లు. ఇలా వుంది అలా వుంది అంటూ. ఇలాంటి టైమ్ లో తమిళ హీరో మాధవన్ తో కలిసి చేస్తున్న సినిమా నిశ్శబ్దం.…

అనుష్కను తెరపై చూసి ఏడాది దాటిపోతోంది. ఈలోగా రకరకాల గ్యాసిప్ లు. ఇలా వుంది అలా వుంది అంటూ. ఇలాంటి టైమ్ లో తమిళ హీరో మాధవన్ తో కలిసి చేస్తున్న సినిమా నిశ్శబ్దం. కోనవెంకట్, పీపుల్స్ మీడియా కలిసి నిర్మిస్తున్న ఈ డిఫరెంట్ సినిమా ఫస్ట లుక్ పోస్టర్ ఈరోజు వదిలారు. ఈ సినిమాలో అనుష్క పాత్ర ఏమిటో కూడా ఈ పోస్టర్ ద్వారా రివీల్ అయింది.

ఆర్టిస్ట్ గా కనిపిస్తోంది పోస్టర్ లో అనుష్క. నిశ్శబ్దం టైటిల్ కింద ట్యాగ్ లైన్ గా సాక్షి ది మ్యూట్ ఆర్టిస్ట్ అని పెట్టడంతోనే తెలుస్తోంది. అనుష్క మూగ అమ్మాయి పాత్ర చేస్తోందని. ఎప్పుడో సిరిసిరిమువ్వ సినిమాలో జయప్రద చేసింది అలాంటి క్యారెక్టర్. మరి ఈ సినిమాలో అనుష్క పాత్ర ఏ మేరకు మూగగా వుంటుందో చూడాలి.

సాక్షి అన్న పేరు అమ్మాయికి పెట్టారు. పైగా మాటలు రావు అన్నారు అంటే ఏదో క్రయిమ్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నట్లు, దానికి విట్ నెస్ (సాక్షి)గా అనుష్క వుంటుందని అనుకోవాల్సి వుంటుంది. పీపుల్ మీడియా పతాకంపై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఎగ్జిక్యూషన్ వివేక్ కూచిభొట్ల చూస్తున్నారు.

ఎంత పని చేసావయ్యా సుజీత్‌!