అరవై దాటేసిన హీరోను అందరూ అందంగా చూపించలేరు. అందులోనూ సీనియర్ హీరో బాలయ్య అందం చూపించాలంటే దర్శకుడు బోయపాటి తరువాతే. ఈ కాంబినేషన్ లో తయారవుతున్న అఖండ సినిమా నుంచి పాట బయటకు వదిలారు.
అడిగా..అడిగా అంటూ సాగే ఈ మెలోడీకి థమన్ స్వరాలు అందించారు. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరక్షన్ చాలా కలర్ ఫుల్ గా వుంది. ఎస్పీబీ స్వరవారసుడు చరణ్ పాడడం విశేషం.
బోయపాటి మార్కు నిండైన చిత్రీకరణతో పాట సాగింది. పాటలో చూపిన విడియో క్లిప్స్ లో కానీ, స్టిల్స్ లో కానీ బాలయ్య అందంగా కనిపించాడు. బోయపాటి మాత్రమే బాలయ్యను అందంగా చూపించగలరు అని ఫ్యాన్స్ ఎందుకు అంటారో ఈ పాట క్లిప్స్ చూస్తే అర్థం అవుతుంది.
టికెట్ రేట్లు, హండ్రెండ్ పర్సంట్ ఆక్యుపెన్సీ వస్తే అఖండ సినిమా దసరాకు థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అఘోరాగా ఓ క్యారెక్టర్ వుంటుందన్న సంగతి తెలిసిందే.