ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వాస్తవానికి అధికారిక పర్యటన. కానీ చివరకు అది రాజకీయ పర్యటనగా మారింది. మీడియా కూడా ఎక్కువగా రాజకీయ అంశాలకే ప్రాధాన్యం ఇచ్చింది. మోడీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా అరగంట మాట్లాడారు. ఈ రోజు కూడా ఆయన్ని విశాఖలోనే ఉండాలని చెప్పినట్లు సమాచారం. పవన్ తో మాట్లాడిన తరువాతే రాష్ట్ర బీజేపీ నాయకులతో మాట్లాడారు. వాస్తవానికి ఈ రాజకీయ సమావేశాలు నిర్వహించాల్సింది పార్టీ అధ్యక్షుడు నడ్డా లేదా మోడీకి సన్నిహితుడైన హోమ్ మంత్రి అమిత్ షా. కానీ వారిద్దరూ కాకుండా ప్రధాని చొరవ తీసుకొని రాజకీయ సమావేశాలు నిర్వహించడం ఆయన స్థాయికి తగింది కాదు. దీన్నిబట్టి తేలింది ఏమిటంటే ఏపీలో బీజేపీ రాజకీయ భవిష్యత్తు పట్ల మోడీ చాలా ఆందోళన చెందుతున్నారని, తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అర్ధమవుతోంది.
పవన్ కళ్యాణ్ ను చేజార్చుకుంటే బీజేపీకి సీట్లు రావని మోడీకి ఆందోళనగా ఉంది. నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయంగా పిల్ల కాకి కిందే లెక్క. అలాంటివాడికి మోడీ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. మోదీని కలవాలని పవన్ అనుకోలేదు. కలుస్తానని అపాయింట్మెంట్ అడగలేదు. కానీ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి జనసేన అధినేతకు సమాచారం వచ్చింది. శుక్రవారం సాయ్తంత్రం విశాఖలో కలుద్దామని సమాచారం పంపారు. ప్రధాని పిలిచారు కాబట్టి… తిరస్కరించే అవకాశం లే్దు. పవన్ వెళ్లారు. సమావేశం అయ్యారు. కానీ మోదీకి పవన్ ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారన్నది ఇప్పుడు కీలకమైన ప్రశ్న.
ప్రధాని మోదీ గత నాలుగైదేళ్ల కాలంలో చాలా సార్లు ప్రధానితో భేటీ కావాలనుకున్నారు. తన కోసం కాదు, జనసేన కోసం కూడా కాదు.. చేనేత కళాకారుల కోసం. ఇతర వర్గాల సమస్యల కోసం కలుద్దామనుకున్నారు. వారందరికీ తాను ప్రధాని దగ్గరకు తీసుకెళ్తానని మాటిచ్చారు. కానీ అపాయింట్మెంట్ లభించకపోవడంతో తీసుకెళ్లలేకపోయారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత చాలా సార్లు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని అపాయింట్ కోసం ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేదు. తర్వాత పవన్‌కే విరక్తి పుట్టి అడగడం మానేశారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా మోదీ పిలిచి మాట్లాడారు. ఒక్క ప్రధాని మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాలకు ఏ బీజేపీ ముఖ్య నేత వచ్చినా పవన్ కల్యాణ్‌ను పట్టించుకోలేదు.
ఏ కార్యక్రమం జరిగినా పొత్తులో ఉన్నందున కనీసం ఆహ్వానించాలన్న ఆలోచన కూడా చేయలేదు. జేపీ నడ్డా వచ్చినా.. అమిత్ షా వచ్చినా.. మోదీ వచ్చినా అదే తీరు. దీంతో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశపూర్వకంగా బీజేపీ అవమానిస్తోందన్న అభిప్రాయానికి జనసైనికులు ఎప్పుడో వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం అనూహ్యంగా పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం పంపారు. తెలంగాణ పార్టీ నేతలు అయితే గ్రేటర్ ఎన్నికల్లో మద్దతు కోసం వచ్చి.. మొత్తం అభ్యర్థుల్ని ఉపసంహరించుకునేలా చేశారు. తీరా ఎన్నికలైన తర్వాత అవమానించారు. దీంతో గౌరవం లేని చోట ఉండలేనని తెలంగాణలో పొత్తును తెంపేసుకున్నారు. కొన్ని చోట్ల పోటీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఏపీలో కూడా దాదాపుగా అదే పరిస్థితి.
సీఎం అభ్యర్థిగా తిరుపతి ఉపఎన్నికల సమయంలో ప్రకటించి.. తీరా తర్వాత మాత్రం అలాంటిదేమీ లేదన్నారు. అదే సమయంలో వైసీపీని గద్దె దించే విషయంలో పవన్ చూపిస్తున్న పట్టుదల బీజేపీలో కనిపించడం లేదు. దీంతో పవన్ దూరం జరిగే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో మోదీతో పిలుపు పవన్‌కు వచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఓట్లు చీలకుండా చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే బీజేపీ నేతలు మాత్రం .. జనసేన తమతోనే ఉంటుందని గట్టిగా చెబుతున్నారు. జనసేనతో కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెబుతున్నారు. కానీ రాష్ట్ర నేతల వ్యవహారంపై పవన్ కల్యాణ్‌కు అంత నమ్మకం లేదు. అందుకే మోదీ చెబితేనే వింటారని.. ఆయనతో చెప్పించేందుకు బీజేపీ నేతలు ఇలా పవన్ కల్యాణ్‌తో భేటీ ఏర్పాటు చేయించారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
ఇక రాష్ట్ర బీజేపీ నాయకులతో ప్రధాని సమావేశమైనప్పుడు బాగానే క్లాసు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. రాజకీయంగా బలోపేతం కావటం పైన ఏపీ బీజేపీ నేతలు ఫోకస్ చేయాలని ప్రధాని ఆదేశించారు. అందుకోసం స్థానికంగా ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజల్లో నిలదీయాలని నిర్దేశించారు. ఇప్పటి వరకు అలా చేయద్దని ఎవరైనా చెప్పారా అంటూ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ తీరు పైన పార్టీ నేతలు వివరించే ప్రయత్నం చేసారు. వైసీపీ ప్రభుత్వం అప్పులు – భూ కబ్జాలు తప్ప రాష్ట్రం కోసం చేసింది ఏమీ లేదని పార్టీ నేతలు పురందేశ్వరి, సత్య కుమార్, మాధవ్, వాకాటి నారాయణ రెడ్డి, సీఎం రమేశ్, సుజనా చౌదరి తదితరులు మోదీ దృష్టికి తీసుకొచ్చారు.
అలాంటి పరిస్థితిని బయట పెట్టాలి కదా అంటూ ప్రధాని పార్టీ నేతలను ప్రశ్నించారు. ఏపీలో పార్టీ బలోపేతం పైన ప్రధాని కీలక మార్గనిర్దేశం చేసారు. ఏపీలో పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారు. ఏపీపై సీరియస్ గా దృష్టి పెడతామని… పూర్తిస్థాయి ఇన్చార్జిని నియమిస్తామని మోదీ చెప్పారు. యువతను ఆకట్టుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. చివరకు మోడీ అధికార పర్యటన రాజకీయ పర్యటనగా మారింది.